టాలీవుడ్ లో ఓ వైపు సీనియర్ హీరోల కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇస్తూ ఉంటే హీరోల కుమార్తెలు నిర్మాతలుగా మారి సినిమాలు చేస్తున్నారు. అలా సినిమాలు చేస్తూ సూపర్ హిట్ లు అందుకుంటున్నారు కూడా. ఇప్పటికే టాలీవుడ్ లో మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నాగబాబు కుమార్తె నిహారిక సైతం నిర్మాతగా మారారు. మొదట నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కలిసి రాకపోవడంతో మళ్లీ సినిమాల్లో కనిపించడం లేదు. కానీ నిర్మాతగా ఇప్పటికే వెబ్ సిరీస్, సినిమాలు తీస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు మరో సీనియర్ హీరో కుమార్తె కూడా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు ఫిలింనగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తేజస్విని పెద్దగా వార్తల్లో ఉండేవాళ్ళు కాదు కానీ ఇటీవల కాలంలో ఆమె సినిమాలపై ఆసక్తి చూపించడంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నారు. మొదట బాలయ్య హోస్టుగా చేసిన అన్ స్టాపబుల్ షోకు క్రియేటివ్ హెడ్ గా పనిచేసి తన టాలెంట్ నిరూపించుకున్నారు.

షాపింగ్ మాల్ యాడ్ లో మెరిసిన తేజస్వినీ

ఇటీవల ఓ బంగారం షాప్ యాడ్ లోనూ నటించి మెప్పించారు. అంతేకాకుండా అప్పట్లో తేజస్విని డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఆమె నటిగా ఎంట్రీ ఇస్తున్నారు అంటూ కూడా జోరుగా ప్రచారం సాగింది. కానీ నిజానికి తేజస్విని నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కంటే ముందే తేజస్విని సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ టాక్ వినిపిస్తోంది. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్నట్టు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బింబిసార దర్శకుడు వశిష్టతో మోక్షజ్ఞ సినిమాను ప్రకటించారు. అయితే ఈ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ప్రస్తుతం వశిష్ట మెగాస్టార్ తో విశ్వంభర సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందే తేజస్విని సినిమా వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

తేజస్విని నిర్మించబోయే సినిమాపై ఆసక్తికర విషయాలు

తేజస్విని నిర్మించబోయే సినిమాపై మరికొన్ని ఆసక్తికర విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాలో హీరో గా నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా స్వయంభు నిర్మాత భువన్ దర్శకత్వం వహించబోతున్నారట. నిర్మాతగా చేసిన భువన్ కు ఇదే దర్శకుడిగా తొలి సినిమా కావడం విశేషం. సిజిమా కోసం భువన్ ఓ కొత్త ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కూడా సిద్ధం చేయడంతో ఆ కథ తేజస్వినికి విపరీతంగా నచ్చిందట. దీంతో వెంటనే ఆ సినిమాను నిర్మించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ నెలలోనే చాలా గ్రాండ్ గా ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

హీరోగా  ఏంజెల్ సినిమా హీరో

ఈ చిత్రంలో గతంలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా వచ్చిన ఏంజెల్ సినిమా ఈ అన్వేష్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అన్వేష్ హీరోగానే తేజస్విని సినిమా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ సినిమాలో ప్రముఖ నటుడు బాబీ సింహ కూడా కీలక పాత్ర నటించబోతున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ ఇతర నటి నటుల వివరాలు కూడా సినిమా లాంచ్ రోజున తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినాప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం దీనిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరి బాలయ్య కుమార్తె తేజస్విని సినిమా తీస్తే ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.