అదృష్టం ఉండాలి కానీ ఆఫర్స్ అవే వెతుక్కుంటూ వస్తాయి. అప్పటివరకు బ్యాడ్ టైం నడిచినా ఇండస్ట్రీ మొత్తం పక్కన పెట్టినా.. టైం వచ్చినప్పుడు వాటంతటవే ఆఫర్స్ వస్తాయి. ఇప్పుడు టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డేను చూస్తే అదే అనిపిస్తుంది. వరుస ఫ్లాప్ లు వెంటాడుతున్న సమయంలో బుట్ట బొమ్మకు ఆఫర్లు గతంతో పోలిస్తే కొంతవరకు తగ్గిన సంగతి తెలిసిందే. పూజ హెగ్డే తెలుగులో ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మెగా హీరో వరుణ్ తేజ్ టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఈ చిత్రంతోనే పూజ సైతం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వగా.. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించకపోయినా పూజా లుక్స్ కు మాత్రం దర్శక నిర్మాతలు ఫిదా అయ్యారు. దీంతో బ్యూటీకి ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆఫర్లను అందుకుంది. టాలీవుడ్ లోని దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ పూజా హెగ్డే సినిమాలు చేసింది. పాన్ ఇండియా సినిమాలలోనూ హీరోలకు జోడి కట్టి సూపర్ హిట్ లు అందుకుంది.
బాలీవుడ్ కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకున్న బ్యూటీ
టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గడంతో ఈ బ్యూటీ కోలీవుడ్, బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే కోలీవుడ్లో బీస్ట్, రెట్రో, జన నాయకన్ లాంటి భారీ ఆఫర్లు వచ్చినా అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడింది లేదు. కూలీ సినిమాలో కూడా ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న శ్రీశ్రీ సినిమాలో నటిస్తోంది. అదేవిధంగా తమిళంలో కాంచన 4 సినిమాలోను నటిస్తోంది. వీటితో పాటు కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న బిల్లా రంగా భాష సినిమాలోను హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇన్ని ఆఫర్లు వచ్చినా తనకు లైఫ్ ఇచ్చిన సొంత గడ్డ టాలీవుడ్ లో మాత్రం ఫ్లాప్ లు రావడం, ఆఫర్స్ లేకపోవడం బుట్ట బొమ్మను నిరాశపరిచాయి. కానీ మళ్ళీ ఇప్పుడు తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హీరోతోనే మళ్లీ బుట్ట బొమ్మ జోడి కట్టబోతున్నట్టు తెలుస్తోంది.
మళ్ళీ అల్లు అర్జున్ తో జోడీ
పూజ హెగ్డే కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో అలా వైకుంఠపురంలో సినిమా ముందు ఉంటుంది. ఈ సినిమా ఇచ్చిన హైక్ తోనే పూజా ఆకాశానికి ఎదిగింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి మళ్లీ అలాంటి హిట్ రాలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ బుట్ట బొమ్మకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో పూజ హెగ్డే మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే కొన్ని కారణాలవల్ల ఆ ప్రాజెక్టు నుండి ఈ బ్యూటీ తప్పుకుంది. ఆ తర్వాత ఈ సినిమా కీర్తి సురేష్ కి వెళ్ళింది. అప్పటినుండి మళ్ళీ పూజ తెలుగు తెరపై కనిపించలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ 23వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బన్నీని పూజా హెగ్డేను సజెస్ట్ చేసినట్టుగా ఇండస్ట్రీలో జోరుగా చర్చ కూడా జరుగుతోంది. అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో ఈ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పూజ హెగ్డేను దాదాపు హీరోయిన్ గా ఖరారు చేసినట్టు కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అల్లు అర్జున్ సినిమాలో గనక పూజ హెగ్డే కన్ఫర్మ్ అయితే ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. బుట్ట బొమ్మకు తిరిగి టాలీవుడ్ లో మంచి రోజులు వస్తాయా లేదా అన్నది కూడా వేచి చూడాలి.



