టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ “ఫిల్మీ బౌల్” వెబ్ సైట్‌ను అధికారికంగా లాంఛ్ చేశారు. తమన్ తన ఎక్స్ వేదికగా వెబ్ సైట్‌ను లాంచ్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఫిల్మీ బౌల్ గత కొన్ని సంవత్సరాలుగా ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా సినిమాలకి సంబంధించిన అప్డేట్స్, రివ్యూలు, వార్తలను అందిస్తోంది. మిగతా సినిమా పేజీలకంటే కచ్చితంగా వేగంగా ఫిల్మీ బౌల్ అప్డేట్స్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ ప్లాట్ ఫామ్ లో లక్షల మంది ఫాలోవర్డ్ ను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సినిమా వార్తలతో పాటు పొలిటికల్, జనరల్ వార్తలు విశ్లేషణలు సైతం అందించేందుకు వెబ్ సైట్ ద్వారా మీ ముందుకు వస్తోంది. సోషల్ మీడియాలో ఎలా అయితే మా అకౌంట్ లను ఆదరించారో అదేవిధంగా వెబ్ సైట్ ను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. వెబ్ సైట్ ను లాంచ్ చేసిన టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
టాలీవుడ్‌లో తనదైన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి ఎన్నో మూవీల విజయాలలో కీలక పాత్ర పోషించారు. స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ, భారీ అంచనాలున్న చిత్రాల్లో భాగమవుతూ తన కెరీర్‌ను అద్భుతమైన రీతిలో ముందుకు సాగుతున్నారు. ఆయన అందించే మాస్ తో పాటు మెలోడీ పాటలతోనూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నారు.
ఇండస్ట్రీలో తమన్ ప్రస్థానం
తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్. చిన్న వయసు నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆయన, రిథమ్ ప్లేయర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం సంగీత దర్శకుడిగా ఎదుగుతూ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 2009లో రవితేజ – సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన ‘కిక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత వరుస సినిమాలకు సంగీతం అందించారు.
‘దూకుడు’, ‘బిజినెస్‌మ్యాన్’, ‘బాద్షా’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ‘అలా వైకుంఠపురంలో’, ‘అరవింద సమేత’, ‘ఓజీ’ వంటి సినిమాలు తమన్ కెరీర్‌లో కీలకంగా నిలిచాయి. ముఖ్యంగా భారీ బీట్స్‌తో కూడిన పాటలు, హీరోల ఎలివేషన్‌కు తగ్గ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడంలో ఆయన ప్రత్యేకతను ప్రదర్శించారు. ‘అల వైకుంఠపురములో’ సినిమాకు అందించిన సంగీతం ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ చిత్ర సంగీతానికి గాను ఆయన జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకున్నారు.
తమన్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్
తమన్ కెరీర్‌లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఆల్బమ్స్ ఎన్నో ఉన్నాయి. ‘దూకుడు’, ‘బిజినెస్‌మ్యాన్’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’ సినిమాల్లోని పాటలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే ‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్ తమన్ కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాలోని ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాములా’, ‘సామజవరగమన’ పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘ఓజీ’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అలాగే ‘అఖండ’, ‘భీమ్లా నాయక్’, ‘సర్కారు వారి పాట’, ‘వీరసింహారెడ్డి’, ‘గుంటూరు కారం’ వంటి సినిమాలకు అందించిన సంగీతంతోనూ తమన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా ‘అఖండ’ చిత్రానికి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కథలోని తీవ్రతను, హీరో పాత్రలోని పవర్‌ను తన సంగీతంతో మరింత ప్రభావవంతంగా చూపించడంలో తమన్ సఫలమయ్యారు. పాటలతో పాటు నేపథ్య సంగీతంలోనూ తనదైన శైలిని కొనసాగిస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
తమన్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం తమన్ చేతిలో పలు ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న ‘దాదా’ తో పాటు చిరంజీవి హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాకా’ చిత్రానికి ఈయన సంగీతం అందిస్తున్నారు. అలాగే వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ సినిమాకు కూడా ఆయన సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఒకవైపు స్టార్ హీరోల సినిమాలు, మరోవైపు విభిన్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాలకు సంగీతం అందిస్తూ తమన్ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. రాబోయే సినిమాల్లో ఆయన ఎలాంటి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను అలరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నో విజయవంతమైన ఆల్బమ్స్ అందించిన తమన్, రాబోయే ప్రాజెక్టులతోనూ తన సంగీత ప్రయాణంలో మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.



