టాలీవుడ్ లోని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు తనదైన స్టైల్ లో మ్యూజిక్ అందిస్తూ సంగీత ప్రపంచంలో మోత మోగిస్తున్నాడు తమన్. ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ 1983 నవంబర్ 16న నెల్లూరులో జన్మించగా ఈరోజు 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తమన్ సాధించిన విజయాలపై… ఆయన జీవితం గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలపై ఫిల్మీ బౌల్ ప్రత్యేక ఆర్టికల్ ను అందిస్తూ తమన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది.
తమన్ మ్యూజిక్ గురించి తెలియని మ్యూజిక్ లవర్స్ ఉండరు. కానీ ఆయన బ్యాక్ గ్రౌండ్ అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. తమన్ పూర్తి పేరు గంటసాల సాయి శ్రీనివాస్ తమన్. ఈయన ప్రముఖ దర్శక నిర్మాత ఘంటసాల బాలరామయ్య మనవడు కావడం విశేషం. తమన్ స్వగ్రామం నెల్లూరు అయినప్పటికీ చిన్నతనం నుండి ఆయన చెన్నైలోనే పెరిగారు. తమన్ తండ్రి అశోక్ కుమార్ సైతం సంగీత ప్రపంచంలోనే రాణించారు. ఈయన ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర డ్రమ్స్ వాయించేవారు. తల్లి సవిత్రది సైతం సంగీత ప్రపంచమే కావడం విశేషం. ఆమె ప్రముఖ నేపథ్య గాయనిగా పేరు సంపాదించుకున్నారు. ఇలా చిన్ననాటి నుండి సంగీత ప్రపంచంలో పెరిగిన తమన్ అడుగులు సైతం మ్యూజిక్ వైపే పడ్డాయి.
ఆరేళ్ల వయసునుండే మ్యూజిక్ వైపు అడుగులు
దీంతో తమన్ కూడా ఆరేళ్ల వయసు నుండే డ్రమ్స్ వాయించడం మొదలుపెట్టాడు. తల్లి, తండ్రి తో పాటు తమన్ కూడా స్టూడియోలకు వెళ్లేవారు. ఈ క్రమంలో తమన్ తండ్రి విదేశాల నుండి డ్రమ్స్ తీసుకురాగా ఇంటి చుట్టుపక్కల జరిగే పండగల్లో తమన్ వాటిని వాయించేవారు. కేవలం 13 ఏళ్ల వయసులోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మాధవ పెద్ది సురేష్ మ్యూజిక్ అందిస్తున్న “భైరవద్వీపం” సినిమాకు తమన్ డ్రమ్మర్ గా పనిచేశాడు అనే విషయం చాలామందికి తెలియదు. ఈ సినిమాకు మొదటి రెమ్యూనరేషన్ గా కేవలం 30 రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత చిన్న వయసులోనే రోజుకు 30 నుండి రోజుకు 3వేలు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. కేవలం ఆరవ తరగతిలోనే తండ్రి కన్నుమూయడంతో ఆ కుటుంబం భారం తనపై వేసుకున్నాడు. ఎస్పీ బాలసుబ్రమణ్యం రాజ్ కోఠి, మాధవ పెద్ది సురేష్, గంగై అమరన్, శివమణి దగ్గర అసిస్టెంట్ గా పని చేసేవాడు.
బాయ్స్ అవకాశం ఎలా వచ్చింది
ఈ క్రమంలో తమిళ స్టార్ట్ డైరెక్టర్ శంకర్ తాను తాను తీయబోయే బాయ్స్ సినిమాలో నిజమైన డ్రమ్మర్ కావాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ తమన్ ను శంకర్ కు పరిచయం చేశాడు. అప్పటికే తమన్ డ్రమ్మర్ గా రాణిస్తూ ఉండటంతో బాయ్స్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. తమన్ నటించిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాకు అభిమానులు ఉన్నారు.
కిక్ సినిమాతో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ
తెలుగులో వచ్చిన కిక్ సినిమాతో తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదటి సినిమాకే మంచి మ్యూజిక్ అందించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కెరీర్ ప్రారంభంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బృందావనం, మహేష్ బాబు దూకుడు, బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి తమన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు. తక్కువ కాలంలోనే తమన్ ఈ స్థాయికి ఎదగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో తమన్ అందించిన “సారోస్తారా…” పాట ఒక ఊపు ఊపింది. ఈ పాట తర్వాత తమన్ గురించి అంతా వెతకడం ప్రారంభించారు.
తమన్ జీవితాన్నే మార్చిన ఒక్కడు
మణిశర్మ తో కలిసి “ఒక్కడు” సినిమాకు పని చేయడం తన జీవితాన్నే మార్చేసిందని తమన్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. తనకు 24 ఏళ్ళు వచ్చేసరికి ఇండస్ట్రీలో దాదాపు 64 మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర 900 సినిమాలకు పని చేసినట్టు చెప్పారు. కేవలం తెలుగులోనే కాకుండా మరాఠీ, ఒరియా, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ తమన్ నంబర్ వన్ డ్రమ్మర్ గా పేరు సంపాదించుకున్నారు. అప్పట్లో తమన్ డ్రమ్మర్ గా రూ.40 వేలు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. 24 ఏళ్ల వయసులోనే తమన్ కు తమిళ్ లో ఓ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం దొరికింది. తర్వాత అన్ని భాషల్లోనూ తమన్ సంచలనాల మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు.
10ఏళ్లలోనే 100 సినిమాలు పూర్తి
2018లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సీమతో తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా 100 సినిమాలను పూర్తి చేసుకున్నాడు. దీంతో కేవలం పదేళ్ల గ్యాప్ లోనే 100 సినిమాలు పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ రికార్డు మణిశర్మ తర్వాత తమన్ కే దక్కడం విశేషం. ఇక తెలుగులో ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ 2017లో గోల్ మాల్ – 4తో బాలీవుడ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సింబ అనే మరో సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లోనూ మ్యూజిక్ అందిస్తూ ఫుల్ బిజీ సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు. ఇటీవల ఇట్లు అర్జున సినిమాకు మ్యూజిక్ అందించి తమన్ ఆ సినిమా విజయానికి కృషి చేశారు. మరోవైపు త్వరలో విడుదల కాబోతున్న బాలయ్య దాదా, పవన్ కళ్యాణ్ ఓజీ 2, చిరంజీవి కాకా, ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ తో సహా పలు భారీ ప్రాజెక్టులకు తమన్ మ్యూజిక్ అందించబోతున్నారు.



