విక్టరీ వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కుటుంబ కథా చిత్రాలతో పాటు వినోదాత్మక సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఆయన తాజాగా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 (AK 47)’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించడం మరో ప్రత్యేకత. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
కథా నేపథ్యం.. భారీ అంచనాలు
ఒక ఆదర్శవంతమైన కుటుంబంలా కనిపించే ఇంట్లో అనూహ్యంగా చోటుచేసుకున్న సంఘటనల కారణంగా దాగి ఉన్న రహస్యాలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు బయటపడటం ఈ సినిమా ప్రధాన కథాంశంగా తెలుస్తోంది. కుటుంబ భావోద్వేగాలు, హాస్యం, యాక్షన్ అంశాలను కలిపి త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో వెంకటేష్ ‘చిట్టిబాబు’ అనే పాత్రలో కనిపించగా, శ్రీనిధి శెట్టి ‘స్వర్ణ’ పాత్రలో నటించారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటు వినోదానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రచార చిత్రాలు తెలియజేశాయి.
ప్రపంచవ్యాప్తంగా రూ.63 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్!
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.63 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ముఖ్యంగా నైజాం, సీడెడ్, ఆంధ్ర ప్రాంతాల్లో ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది.
నైజాం ప్రాంతంలో రూ.17 కోట్ల బిజినెస్ జరగగా, సీడెడ్‌లో రూ.7 కోట్లు, ఆంధ్ర ప్రాంతంలో రూ.20 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.44 కోట్లకు చేరుకుంది. ఇక కర్ణాటకతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల్లో సుమారు రూ.6 కోట్ల బిజినెస్ జరిగినట్లు అంచనా. ఓవర్సీస్ మార్కెట్లో రూ.13 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కలన్నింటినీ పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆదర్శ కుటుంబం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.
– నైజాం: రూ.17 కోట్లు
– సీడెడ్: రూ.7 కోట్లు
– ఆంధ్ర: రూ.20 కోట్లు
– ఏపీ, తెలంగాణ మొత్తం: రూ.44 కోట్లు
– కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ.6 కోట్లు
– ఓవర్సీస్: రూ.13 కోట్లు
– ప్రపంచవ్యాప్త బిజినెస్: రూ.63 కోట్లు
హిట్ స్టేటస్ అందుకోవాలంటే రూ.64 కోట్లు రావాల్సిందే!
ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.63 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.64 కోట్ల. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలిపి సుమారు రూ.64 కోట్ల థియేట్రికల్ షేర్ సాధిస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని చేరుకున్నట్లు అవుతుంది. అంతకంటే ఎక్కువ షేర్ సాధిస్తే లాభాల బాట పట్టినట్లు చెప్పుకోవచ్చు.
బలమైన సాంకేతిక బృందం.. భారీ తారాగణం
ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, రఘుబాబు, యూవినా పార్తవి, రాజా ప్రజ్వల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ప్రత్యేక గీతంలో డింపుల్ హయతి సందడి చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ ఎస్ సంగీతాన్ని అందించగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. నవీన్ నూలి ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చేపట్టారు.
మొత్తానికి వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశం ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలుస్తాయని అంచనా. అయితే రూ.64 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సినిమా అన్ని ప్రాంతాల్లోనూ మంచి వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. మరి తాజాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది? వెంకటేష్ ఖాతాలో మరో విజయాన్ని చేరుస్తుందా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.



