పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నటించిన పలు చిత్రాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పరచగా, ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా కూడా టాలీవుడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోపై వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆ వీడియోను తొలగించాలంటూ కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ చిత్ర బృందం అభిమానులకు ప్రత్యేక కానుకగా గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. తమ అభిమాన హీరోను కొత్త పాత్రలో చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ వీడియోపై కూడా చర్చ మొదలైంది.
సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో గ్లింప్స్ వీడియోలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. సినిమా నేపథ్యం, హీరో పాత్ర, కథలోని ప్రధాన అంశాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు చిత్ర బృందాలు ఇలాంటి వీడియోలను విడుదల చేస్తుంటాయి. ముఖ్యంగా ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సినిమాలకు సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలైనప్పుడు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా వాటిని ఆసక్తిగా గమనిస్తుంటారు. అయితే ‘ఫౌజీ’ గ్లింప్స్ వీడియో విషయంలో మాత్రం తాజాగా వివాదం తెరపైకి వచ్చింది.
గ్లింప్స్ వీడియోపై ఎందుకు వివాదం?
తాజాగా విడుదలైన పౌజీ గ్లింప్స్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, ప్రభాస్ పాత్రకు ఎలివేషన్ ఇస్తూ హిట్లర్ తో మాట్లాడుతూ ఉంటాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప స్వతంత్ర సమరయోధుడు ప్రభాస్ పాత్రకు ఎలివేషన్ ఇవ్వడం ఏమిటి? అది ఆయనను కించపరచడంతో సమానం అని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని, ఆ సన్నివేశాలు సినిమాలో అసలు ఉండకూడదని కొంతమంది చిత్ర బృందం పై ఫైర్ అవుతున్నారు.
ఇక మరికొందరు ఇది కేవలం కల్పిత కథతో తెరకెక్కుతున్న సినిమా. ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప వ్యక్తిని మరింత గొప్పగానే చూపిస్తారు అనే వాదనను వినిపిస్తున్నారు.
ఇక ఈ సినిమా విడుదల అయ్యాక గ్లింప్స్ వీడియోలో చూపెట్టిన సన్నివేశాలు ఉంటాయా? లేదా? అనే దానిపై పూర్తి క్లారిటీ వస్తుంది.
ఇకపోతే ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ఇమాన్వి నటిస్తుండగా మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ భారీ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
‘ఫౌజీ’పై భారీ అంచనాలు
మొదటి నుండి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ మూవీ ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి తారాస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మరి వాటిని అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.
కొత్త విడుదల తేదీతో అభిమానుల్లో ఆనందం
ఫౌజీ చిత్రాన్ని కొంతకాలం క్రితం డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దానితో అభిమానులు చాలా ఆనందపడ్డారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ మూవీ బృందం వారు స్పందించకపోవడంతో అభిమానులు కంగారుపడ్డారు. ఇక తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన గ్లింప్స్ లో ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.



