కొన్ని సినిమాలకు ముందే సీక్వెల్స్ ప్లాన్ చేస్తే మరి కొన్ని సినిమాలకు మాత్రం సీక్వెల్స్ చేయాల్సి వస్తుంది. అలా సీక్వెల్ తీయాల్సి వచ్చిన సినిమానే ఈ నగరానికి ఏమైంది రిపీట్. 2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది ( Ee Nagaraniki Emaindi ) సినిమా ఊహించని విజయాన్ని సాధించింది. ఫన్ అండ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి యూత్ ఫిదా అయ్యారు. తెలుగులో వచ్చిన బెస్ట్ రామ్ కామ్ కామెడీగా ఈ సినిమా నిలిచింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ఈ అభిమానులే తరుణ్ భాస్కర్ వెంట పడ్డారు. ఎట్టకేలకు ఎనిమిది ఏళ్ల తరవాత మళ్ళీ తరుణ్ భాస్కర్ సీక్వెల్ తీశారు. అదే ఈ నగరానికి ఏమైంది రిపీట్ ( ENE Repeat ). మరి ఫస్ట్ పార్ట్ సినిమా మ్యాజిక్ సెకండ్ పార్ట్ లో రిపీట్ అయిందా? లేదా? అనేది ఈ సమీక్షలో చూద్దాం….

కథ:

చిన్ననాటి స్నేహితులు వివేక్ (విశ్వక్సేన్) Vishwaksen, కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి), కౌశిక్ (అభినవ్ గోమటం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను) కన్యా రాశి అనే టీం పేరుతో తీసిన సినిమా డిజాస్టర్ అవుతుంది. దీంతో ఆ సినిమా నిర్మాత (మహేష్ భాస్కర్) ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత వివేక్ కు ఛాన్సులు రాకపోవడంతో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవితం గడుపుతాడు. కానీ అప్పటికే కార్తీక్, కౌశిక్, ఉపేంద్ర సినిమాల్లో బిజీగా ఉంటారు. ఈ క్రమంలో సినిమాటోగ్రాఫర్ కార్తీక్ అసిస్టెంట్ గా పనిచేసిన మెడికల్ స్టూడెంట్ కీర్తన (శివాత్మిక రాజశేఖర్) తో ప్రేమలో పడతారు. కానీ కీర్తన తండ్రి మాత్రం తన కూతురికి ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తితో పెళ్లి సెట్ చేస్తాడు. ఆ పెళ్లిని స్నేహితులంతా కలిసి ఎలా చెడగొడతారు? పెళ్లికి చేసిన ఖర్చు తిరిగి ఇవ్వాలంటూ కీర్తన తండ్రి వివేక్ టీంను బెదిరిస్తాడు. సినిమా ఫ్లాప్ అవడం, పెళ్లి క్యాన్సిల్ చేయడంతో చిక్కుల్లో పడ్డ టీమ్ ఆ తర్వాత ఏం చేసింది. డబ్బులు ఎలా కట్టింది? థాయిలాండ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మళ్ళీ సినిమా తీశారా? ఆ సినిమా హిట్ అయిందా? అనేదే ఈ సినిమా కథ.

కథనం & దర్శకత్వం :

ఫస్ట్ పార్ట్ భారీ విజయం తర్వాత సెకండ్ పార్ట్ కు కథ రాసుకోవడం తరుణ్ భాస్కర్ కు అంత సులువు కాదు. పలు సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని చెప్పారు కూడా. ఫస్ట్ పార్ట్ లో కన్య రాశి టీం పడే కష్టాలు వాళ్ళ మధ్య జనరేట్ అయ్యే కామెడీ మధ్య మధ్యలో వచ్చిన వివేక్ లవ్ స్టోరీ కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ సినిమాలో అలాంటి స్నేహితుల కామెడీతో పాటు వాళ్ల జీవితాల్లో జరిగే మార్పులు, మధ్యలో వచ్చిన కీర్తన పాత్ర ద్వారా ఫ్యామిలీ ఎమోషన్స్ ను తరుణ్ భాస్కర్ చూపించిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే మొదటి 30 నిమిషాలు కథలోకి వెళ్లే వరకు కాస్త స్లోగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత అంకిత్ ఎపిసోడ్ కీర్తన ఇంట్లో ఆమె తండ్రితో డ్రామా తర్వాత సినిమా మొత్తం మారిపోతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరిగిపోతాయి.

సెకండ్ హాఫ్ ప్రారంభంలో కాస్త బోరింగ్ అనిపించినా ఆ తర్వాత మళ్లీ సినిమా ట్రాక్ లోకి వస్తుంది. థాయిలాండ్ ఎపిసోడ్ ప్రారంభం అయిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఎంట్రీలు.. సన్నివేశాలు, సర్ప్రైజ్ లు చక్కగా ప్లాన్ చేశారు. ఊహించని సెలెబ్రెటీల ఎంట్రీతో క్లైమాక్స్ కేకలు పెట్టిస్తుంది. మొత్తంగా చూస్తే అక్కడక్కడా కాస్త బోర్ కొట్టినా ఓవరాల్ గా చూస్తే తరుణ్ భాస్కర్ ప్రేక్షకుల అంచనాలకు దగ్గరగా వెళ్ళారు కానీ రీచ్ అవ్వలేదు.

నటీనటుల పనితీరు:

ఫస్ట్ పార్ట్ లో నటించినట్టుగానే విశ్వక్ అండ్ టీం సెకండ్ పార్ట్ లో తమ నటనతో ఆదరగొట్టారు. అయితే ఈ పార్ట్ లో కార్తీక్ పాత్రలోకి శ్రీనాథ్ మాగంటి కొత్తగా వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి నుండి శ్రీనాథ్ మెప్పిస్తాడా? లేదా? అనే అనుమానాలు ఉండేది. కానీ సుశాంత్ ప్లేస్ ను శ్రీనాథ్ రీప్లేస్ చేశాడు. శివాత్మిక తన నటనతో ఆకట్టుకుంది. అనీషా ఆండ్రోస్ తన గ్లామర్ తో మెప్పించింది. అభినవ్ గోమటం మళ్ళీ తన కామెడి టైమింగ్ తో నవ్వించాడు. సినిమాలో నిర్మాతగా నటించిన మహేష్ తన నటనతో అదరగొట్టాడు. ఇతర నటులు సైతం తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:

ఈ సినిమా విజయానికి మళ్ళీ మ్యూజిక్ ,ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాలు చేసిన కృషి కూడా కారణం. వివేక్ సాగర్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను ఓ రేంజ్ లో కి తీసుకెళ్ళింది. సినిమాలో వచ్చే ఫీల్ గుడ్ ఎమోషనల్ సన్నివేశాలకు బాగా కనెక్ట్ చేస్తుంది. ఈ చిత్రానికి ఆరోన్ సినిమాటోగ్రఫీ కోసం పనిచేయగా అతడి న్యూ ఏజ్ మేకింగ్ అద్భుతంగా ఉంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ ఇంటర్ కట్స్ సినిమాపై అంచనాలను పెంచేలా చేశాయి. అదే విధంగా సందీప్ నాగిరెడ్డి, సృజన్ ఎర్రబోలు అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్& మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే .. విశ్వక్ సేన్ తో పాటు ఇతర నటీనటుల పర్ఫామెన్స్ సినిమాకు ప్లస్ అయింది. వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లింది. ఫ్రీ ఇంటర్వెల్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసాయి.

ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తేహ ఫస్ట్ ఆఫ్ ప్రారంభంలో కాస్త స్లోగా ఉండడం.. సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత కొద్దిగా తగ్గినట్టు అనిపించడం ఈ సినిమాకు మైనస్ గా నిలిచింది.

చివరగా: ఈ నగరానికి ఏమైంది మళ్ళీ రిపీట్ అవ్వలేదు