సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ వసూళ్లను సాధించింది. ఈ విజయంతో ‘జైలర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్-2’ను రూపొందించారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన బడ్జెట్, నటీనటుల పారితోషికాల వివరాలు చర్చనీయాంశంగా మారాయి.
రజినీకాంత్ రెమ్యునరేషన్ రూ.110 కోట్లు!
‘జైలర్-2’ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్‌కు భారీ పారితోషికం అందుతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఆయన సుమారు రూ.110 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రజినీకాంత్‌కు ఉన్న క్రేజ్, ఆయన సినిమాలకు మార్కెట్లో లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు ఈ స్థాయిలో పారితోషికం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
స్టార్ క్యాస్టింగ్‌తో భారీ అంచనాలు
‘జైలర్-2’లో రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌కు సుమారు రూ.35 కోట్లు పారితోషికంగా అందుతున్నట్లు తెలుస్తోంది. అలాగే హృతిక్‌కు రూ.25 కోట్లు, అనిరుధ్‌కు రూ.20 కోట్లు, మోహన్‌లాల్‌కు రూ.15 కోట్లు, శివరాజ్ కుమార్‌కు రూ.8 కోట్లు, విద్యాబాలన్‌కు రూ.6 కోట్లు, ఎస్.జే. సూర్యకు రూ.3 కోట్లు పారితోషికంగా అందుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
రూ.300 కోట్ల భారీ బడ్జెట్!
ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం దాని బడ్జెట్. ‘జైలర్-2’ను సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన్నట్లు సమాచారం. తొలి భాగం సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని సీక్వెల్‌ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించారు. భారీ తారాగణం, ప్రముఖ సాంకేతిక నిపుణులు, నిర్మాణ వ్యయం కలిపి ఈ సినిమా బడ్జెట్ గణనీయంగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద సూపర్ ఇంపాక్ట్
సాధారణంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు అవసరమవుతాయి. ముఖ్యంగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటికే అద్భుతమైన కళాశాలను ఈ చిత్రం రాబట్టి బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతుంది. ఇక మరికొన్ని రోజులు ఈ సినిమాకు ప్రస్తుతం వస్తున్న స్థాయిలో కలెక్షన్లు వస్తే ఈ మూవీ రజినీకాంత్ కెరియర్ లో మరో పెద్ద హిట్ సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఈ మూవీ ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఎలాంటి వసూళ్లు సాధించి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.
మరోసారి అనిరుద్ మ్యాజిక్ రిపీట్
జైలర్ భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంలో అనిరుద్ అందించిన సంగీతం అత్యంత కీలక పాత్రను పోషించింది. దానితో మొదటి నుండి జై జైలర్ 2 మ్యూజిక్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో జైలర్ 2 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉండడంతో ఈ సినిమా విజయంలో కూడా ఆయన పాత్ర కీలకంగా ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
మరోసారి నెల్సన్ దిలీప్ కుమార్ మ్యాజిక్
నెల్సన్ దిలీప్ కుమార్ డార్క్ కామెడీ చిత్రాలను రూపొందించడంలో స్పెషలిస్ట్. ఇప్పటివరకు అలాంటి చిత్రాలతో ఆయన మంచి విజయాలను అందుకున్నారు. అదే కోవలో వచ్చిన జైలర్ కూడా మంచి విజయం సాధించింది. దానితో జైలర్ 2 కూడా ఆ స్థాయి ఇంపాక్ట్ ఇస్తుందని ప్రేక్షకులు మొదటి నుండి భావించారు. జైలర్ 2 విడుదల తర్వాత ఈ సినిమాకు కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో మరోసారి నెల్సన్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధిస్తే నెల్సన్ కి కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా పెరిగే అవకాశం కచ్చితంగా ఉందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



