సినిమాల్లో మనం చూసేది అంతా రియాలిటీ కాదు. ఫైట్ లు, పగలు ప్రతీకారాలు, ప్రేమలు అన్నీ కూడా నటన మాత్రమే. అదే విధంగా సినిమాల్లో స్క్రీన్ పై చూపించే రొమాన్స్ కూడా నటన మాత్రమే. అయితే అలా చూపించే రొమాన్స్ సన్నివేశాలపై మాత్రం కాస్త డోస్ పెరిగితే విమర్శలు వస్తూ ఉంటాయి. ఆ విమర్శలను తట్టుకొని హీరోయిన్లు నిలబడటం చాలా కష్టం. కుటుంబం, భర్త సపోర్ట్ లేకుండా అసలు ఇండస్ట్రీలో నీలదొక్కుకోలేరు. ఈ క్రమంలోనే చాలామంది తమ కుటుంబాలకు సైతం దూరం అవుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం ఇండస్ట్రీలో పనిచేస్తున్న తమ వారిని ఎంకరేజ్ చేస్తూ వారికి అండగా ఉంటారు.

టాక్సిక్ లో కియారా యష్ సన్నివేశాలపై విమర్శలు

తాజాగా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా తన భార్య కియారా అద్వానీకి మద్దతు ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. కియారా అద్వానీ ఇటీవల యష్ హీరోగా నటించిన టాక్సిక్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. కానీ సినిమాలో కియారా సన్నివేశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమెపై ఓ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. దానికి కారణం సినిమాలో ఉన్న సన్నివేశాలే. ఈ సినిమాలోని పాటలు, కొన్ని సన్నివేశాల్లో ఇంటిమేట్, రొమాన్స్ డోస్ పెరిగిపోయింది. అయితే ఇప్పటికే కియారా అద్వానికి సిద్ధార్థ్ మల్హోత్రాతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లైన హీరోయిన్ ఇలా నటించడం ఏంటి? అంటూ విమర్శలు వచ్చాయి. చాలామంది స్పెషల్ డిబేట్ లు పెట్టి మరీ కియారా పై విమర్శలు చేశారు. ఈ క్రమంలో సిద్ధార్థ్ మల్హోత్రా పై కూడా ఓ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. కియారా అద్వానీ ఆ సన్నివేశాలు తొలగించాలి అంటూ దర్శకురాలిని కోరినట్టు కూడా ప్రచారం జరిగింది. ఆ ప్రచారంపై స్పందించిన కియారా తాను అలా కోరలేదని చెప్పింది. అవన్నీ నిరాధారమైన నాన్సెన్స్ మాటలు అంటూ స్పష్టం చేసింది.

కియారాకు అండగా భర్త

తాజాగా కాఫీ విత్ కరణ్ అనే టాక్ షో లో పాల్గొన్న కియారా మాట్లాడుతూ… ట్రోల్స్ విమర్శలు చూసి తాను ఆందోళనకు గురైనప్పుడు భర్త ఇచ్చిన ధైర్యాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.” నీపై విమర్శలు చేసే వ్యక్తులు నీకు తెలియదు. వారికి నీవు ఎవరో తెలియదు. మన వివాహం నచ్చని కొంతమంది ఫ్యాన్స్ చేసే అనవసరమైన రచ్చ ఇది. ఇలాంటి అపరిపక్వ మనుషులను చూసి ఇంట్లో కూర్చుని ఏడవటం కరెక్ట్ కాదు. వాళ్లే కాలక్రమేనా మారిపోతారు. కానీ వాళ్ల కోసం నీ మానసిక ప్రశాంతతను ఎందుకు కోల్పోవాలి… అంటూ తనకు ధైర్యాన్ని చెప్పినట్లు తెలిపింది. అంతే కాకుండా తన నటనను చూసి నీ కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శనగా ఇది నిలుస్తుందని సిద్ధార్థ్ చెప్పినట్టు తెలిపింది. ప్రస్తుతం కియారా అద్వానీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీంతో అతడి మెచ్యూరిటీ పై అభిమానులు, నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అన్ని అర్థం చేసుకోవాలని అప్పుడే హీరోయిన్లు రాణించగలుగుతారని అంటున్నారు. అయితే ఇప్పటికి కూడా కొంతమంది మాత్రం సిద్ధార్థ్ పై ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.

కియారా సిద్ధార్థ్ ప్రేమ పెళ్లి

బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ షేర్షా అనే సినిమాలో కలిసిన నటించారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట 2023లో ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని జైసల్మేర్ లో సూర్య గఢ్ ప్యాలెస్ లో అత్యంత వైభవంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల మధ్య ఈ జంట ఒక్కటైంది. పెళ్లైన తరవాత కూడా ఇద్దరూ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లోని బ్యూటిఫుల్ జంటల్లో వీరిద్దరి జంట కూడా ఒకటి.