సినిమా ఇండస్ట్రీలో ఆనాటి నుండి ఈనాటి వరకు రామాయణం ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని ప్రేక్షకులను మెప్పిస్తే మరికొన్ని మాత్రం నిరాశపరిచాయి. అయితే ఇప్పటివరకు తీసిన రామాయణాల్లో రీసెంట్గా వచ్చిన రన్బీర్ కపూర్, సాయి పల్లవి సినిమా విజువల్ వండర్ గా నిలిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాలో రాముడి పాత్ర కంటే కన్నడ హీరో యష్ నటించిన రావణుడి పాత్రకే ఎక్కువ క్రేజ్ వచ్చింది. డైరెక్టర్ కూడా రావణుడి పాత్రని హైలెట్ చేశాడు. ఈ సినిమాకు నితీష్ తివారి దర్శకం హించారు. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా ఈనెల 5వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమాకు మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా.. మెల్లిమెల్లిగా పుంజుకుంటూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో వచ్చిన అనేక సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది.
ఎనిమిది రోజుల్లో వెయ్యి కోట్లు
ఈ సినిమా విడుదలై ఎనిమిది రోజులు అవుతుండగా మొదటి ఏడు రోజుల్లోనే భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి తొలి వారంలో రూ.1000 కోట్ల వసూళ్లు రావడం విశేషం. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం రామాయణ ఏడు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా రూ.934.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనిలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 615 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. భారత్ లో 511.10 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో 323.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే గతంలో వచ్చిన పుష్ప- 2, దురంధర్ పార్ట్ -2 సినిమాల కలెక్షన్లను మాత్రం దాటలేకపోయింది. ఈ రెండు సినిమాలు ఏడు రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లో చేరగా రామాయణ కేవలం 65.45 కోట్ల తేడాతో ఆ జాబితాలో మూడో స్థానానికి పరిమితమైంది. ఈ సినిమాకు 1000 కోట్ల కలెక్షన్లు రావడానికి 8 రోజులు పట్టింది.
ఫస్ట్ డే నుండి నిలకడగా కలెక్షన్స్
సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ డే నుండి నిలకడగా రోజుకు 100కోట్ల పైగా కలెక్షన్లు సాధిస్తూ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. రోజువారి ప్రపంచ వ్యాప్త గ్రాస్ వసూళ్ల వివరాలు చూసినట్లయితే… మొదటి రోజు రూ. 155 కోట్లు, రెండవ రోజు రూ. 105 కోట్లు, మూడో రోజు రూ. 145 కోట్లు నాలుగో రోజు రూ. 120 కోట్లు, ఐదో రోజు రూ. 165 కోట్లు, ఆరో రోజు. 149 కోట్లు ఏడవ రోజు రూ. 109.5 కోట్లు వసూలు చేసింది.
అన్ని భాషల్లోనూ క్రేజ్
ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అన్ని భాషల్లోనూ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. బుధవారం సైతం ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 109.05 కోట్ల వసూళ్లు రావడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. సినిమాకు నిలకడగా వచ్చిన కలెక్షన్లు చూసి వారంలోనే 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని అంతా భావించారు. కానీ ఆ ఆశ నెరవేరలేదు. ఎనిమిదో రోజు మాత్రం సులభంగా 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ట్రెండ్ ను చూస్తే రాబోయే వీకెండ్స్ లోను సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా మళ్ళీ థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అయ్యే వరకు రామాయణకు బ్రేకులు పడే ఛాన్స్ లేదు.



