టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించే సత్తా ఉందనే విషయం తెలిసిందే. అయితే, ఆయన కెరీర్లో గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో విజయ్ నటించిన తాజా చిత్రం ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఈ రోజు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడగా, తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గత చిత్రాల ఓపెనింగ్ కలెక్షన్లను పరిశీలిస్తే.. ‘రానాబాలి’ ముందు ఒక ఆసక్తికరమైన లక్ష్యం కనిపిస్తోంది.
విజయ్ దేవరకొండ గత సినిమాల ఓపెనింగ్స్ ఇవే
విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) నటించిన గత తొమ్మిది సినిమాల తొలి రోజు వసూళ్లను పరిశీలిస్తే.. ఈ జాబితాలో ‘కింగ్డమ్’ సినిమా అగ్రస్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మొదటి రోజు రూ.11.34 కోట్ల వసూళ్లు వచ్చినట్లు తెలుస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి ఓపెనింగ్ సాధించినప్పటికీ, చివరకు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో విజయ్ దేవరకొండకు భారీ ఓపెనింగ్ వచ్చినా, ఆ జోరును కొనసాగించి విజయాన్ని అందుకోవడం ఎంత ముఖ్యమో ఈ సినిమా మరోసారి నిరూపించింది.
ఇక విజయ్ నటించిన ఇతర సినిమాల తొలి రోజు వసూళ్లను గమనిస్తే.. ‘ఖుషి’ రూ.9.87 కోట్లు, ‘లైగర్’ రూ.9.57 కోట్లు సాధించాయి. ఈ రెండు సినిమాలు కూడా ఓపెనింగ్స్ పరంగా మంచి సంఖ్యలను నమోదు చేశాయి. అయితే, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడంలో మాత్రం ఈ చిత్రాలు వెనుకబడ్డాయి. మరోవైపు ‘గీత గోవిందం’ రూ.5.81 కోట్లు, ‘డియర్ కామ్రేడ్’ రూ.7.50 కోట్లు, ‘నోటా’ రూ.4.55 కోట్లు వసూలు చేశాయి.
వీటితో పాటు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రూ.4.40 కోట్లు, ‘ది ఫ్యామిలీ స్టార్’ రూ.3.85 కోట్లు, ‘టాక్సీవాలా’ రూ.3.30 కోట్ల తొలి రోజు వసూళ్లను సాధించాయి. ఈ లెక్కలను పరిశీలిస్తే విజయ్ దేవరకొండ సినిమాల ఓపెనింగ్స్‌లో గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది.
‘కింగ్డమ్’ రికార్డును ‘రణబాలి’ బ్రేక్ చేస్తుందా?
ఇప్పుడు అందరి దృష్టి ‘రాణబలి’ ( Ranabaali ) తొలి రోజు వసూళ్లపైనే ఉంది. విజయ్ దేవరకొండ గత తొమ్మిది సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా ‘కింగ్డమ్’ ( KIngdom ) నిలిచింది. ఈ సినిమా సాధించిన రూ.11.34 కోట్ల వసూళ్లను ‘రణబాలి’ అధిగమిస్తే.. విజయ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు హీరో కెరీర్ పరంగా కీలకంగా మారాయి. అయితే, ఈ లక్ష్యాన్ని అందుకోవడం అంత సులభమేమీ కాదు.
విజయ్ కి కీలకంగా రణబలి
విజయ్‌కు కీలకంగా మారిన ‘రణబలి’ గత సినిమాల ఫలితాలను పక్కనపెట్టి విజయ్ దేవరకొండ ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ‘కింగ్డమ్’ సాధించిన ఓపెనింగ్‌ను అధిగమించడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద నిలకడైన వసూళ్లు సాధించడం కూడా ఈ సినిమాకు కీలకం కానుంది. కేవలం తొలి రోజు భారీ వసూళ్లు సాధించడం మాత్రమే కాకుండా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకొని విజయవంతమైన చిత్రంగా నిలవడం విజయ్‌కు ఎంతో అవసరం.
మరి ‘రానాబాలి’ తొలి రోజే రూ.11.34 కోట్ల మార్కును దాటి విజయ్ దేవరకొండ కెరీర్లో కొత్త రికార్డును సృష్టిస్తుందా? లేక ‘కింగ్డమ్’ రికార్డు అలాగే కొనసాగుతుందా? అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇక ‘రణబాలి’ చిత్రంలో విజయ్ కి జోడిగా రష్మిక మందన్న నటించింది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలో కెమిస్ట్రీ అద్భుతంగా ఉండడం, అలాగే వీరికి వివాహం కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విజయ్ తన కెరియర్ లోనే మొట్టమొదటిసారి రణబాలి చిత్రంతో పవర్ఫుల్ యాక్షన్ మోడ్ లోకి వెళ్ళాడు. మరి ఈ సినిమాతో ఆయన ఖచ్చితంగా కింగ్డమ్ సినిమా రికార్డును క్రాస్ చేస్తాడని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతోనే ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్ సాధిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.



