ఈ టాలీవుడ్‌కు ఏమైంది.. హీరోలు ఎందుకు ఇలా తాగి సినిమా ఈవెంట్లకు వస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే చర్చ జరుగుతోంది. తాజాగా ఓ టాలీవుడ్ హీరో తన సినిమాకు సంబంధించిన ఈవెంట్‌‌కు ఫుల్లుగా తాగివచ్చాడు. గతంలో జరిగిన సినిమా ఈవెంట్లలో పెద్దగా మాట్లాడని హీరో.. తాజాగా జరిగిన తన సినిమా ఈవెంట్ లో మాత్రం అడక్కపోయినా మైక్ లాగేసుకుని మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా గత ఈవెంట్ లలో హీరోయిన్‌లకు దూరంగా ఉంటూ, సిగ్గుపడిపోయిన హీరో తాజాగా జరిగిన ఈవెంట్ లో మాత్రం హీరోయిన్ పక్కనే కూర్చోవడం, ఆమెతో గుసగుసలు పెడుతూ పట్టుకుని లాగటం.. ఇవన్నీ తేడా కొట్టాయి. అంతేకాకుండా ఆ హీరో ఏకంగా స్టేజిపైకి ఎక్కడి పాట పాడటం, డ్యాన్సులు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. హీరో మాట్లాడుతున్న సమయంలోనూ తడబడటంతో అతడు తాగి ఈవెంట్ కు వచ్చినట్టు అంతా గుర్తించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరో వీడియోలు

ప్రస్తుతం ఆ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు హీరో తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రతి వీడియోకు కూడా హీరో ఫుల్లుగా తాగి వచ్చాడు. 90 వేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో అతడు ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని, తాగటం వల్లనే ఇలా ప్రవర్తిస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు.

గతంలో కొందరు సీనియర్ హీరోలు కుడా ఇంతే

గతంలో కొందరు సీనియర్ హీరోలు సైతం ఇలానే ఈవెంట్లకు మందు కొట్టి వచ్చారు. ఓ సీనియర్ హీరో ఫుల్లుగా తాగి ఓ సినిమా ఈవెంట్ కు రాగా కనీసం కారు కూడా దిగలేక ఇబ్బంది పడ్డారు. దీంతో పక్కనే ఉన్న మరో సీనియర్ హీరో ఆయనను జాగ్రత్తగా తీసుకువెళ్లారు. నడుస్తున్న సమయంలో ఆయన తూలడం మాటలు తడబడటంతో అంతా ఆ హీరో తాగి వచ్చాడని ఫిక్స్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మరో సీనియర్ హీరో ఏకంగా తాగి వచ్చి హీరోయిన్ లపై అసభ్యకర కామెంట్లు చేయడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీలు ఇలా చేస్తే ఎలా?

ఇలా హీరోలు సినిమా ఈవెంట్లకు తాగి రావడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. సెలబ్రెటీలు అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి. ముఖ్యంగా యువత హీరోలనే ఫాలో అవుతూ ఉంటారు. తమ అభిమాన హీరో ఎలాంటి డ్రెస్ వేస్తే అలాంటి డ్రెస్ వేయాలని, ఎలా ఉంటే అలా ఉండాలని కోరుకుంటారు. చాలా విషయాల్లో తమ ఫేవరెట్ హీరోలనే ఫాలో అవుతుంటారు. అలాంటప్పుడు హీరోలు ఇలా తాగి ఫంక్షన్లకు వస్తే సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు అని విమర్శలు వస్తున్నాయి. హీరోలు ఇలా తాగి వస్తే వారి గురించి కూడా పక్కకు వెళ్లిన తరవాత ఇతర యూనిట్ సభ్యులు తప్పుగా మాట్లాడుకునే అవకాశం ఉందని, కెరీర్ లో అవకాశాలు కూడా తగ్గే అకవాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. హీరో ఈవెంట్ కే తాగి వస్తే ఇంకా షూటింగ్ ల పరిస్థితి ఏంటని నిర్మాతలు ఆలోచిస్తారని, కాబట్టి హీరోలు మారాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు.