ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న బ్యూటీ శ్రీలీల. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను సైతం షేక్ చేస్తున్న బ్యూటీ జాహ్నవి కపూర్. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. అటు గ్లామర్, ఇటు ఫ్యామిలీ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా ఈ కుర్ర భామలతో సినిమాలు చేసేందుకు హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరూ ఒకే కుర్రాడి కోసం పోటీ పడుతున్నారట. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? ఆ కథ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం…

శ్రీలీల కెరీర్

కిస్ సినిమా ద్వారా 2019లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. మొదటి సినిమానే ఈ బ్యూటీకి సూపర్ హిట్ దక్కింది. అంతేకాకుండా ఈ సినిమాకు గాను ఉత్తమ డెబ్యూ మహిళ అవార్డును శ్రీలీల సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత కన్నడలో లవ్ టుడే, భారతే లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అంతే కాకుండా పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన జేమ్స్ సినిమాలో ఓ ప్రత్యేకగీతంలో స్టెప్పులు వేసింది. ఆ తర్వాత 2021లో “పెళ్లి సందడి” సినిమా ద్వారా రాఘవేంద్రరావు దర్శకత్వంలో టాలీవుడ్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ బ్యూటీ అందానికి తెలుగు యువత ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత అనేక చిత్రాలలో నటించిన శ్రీలీల ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలతో జోడి కడుతుంది. ఇప్పటికే మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ తో అలరించింది . ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పలు క్రేజీ ప్రాజెక్టులలోనూ ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోంది.

జాహ్నవి కపూర్ గురించి

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ జాహ్నవి కపూర్. 2018లో ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో ప్రేక్షకులను తన మాయలో పడేసుకుంది. బాలీవుడ్ లో మొదటగా ధడక్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత గుడ్ లక్ చెర్రీ, మిలీ, జవార్ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది. బాలీవుడ్ లో చాలానే ప్రాజెక్టులు చేసినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా లక్ కలిసి రాలేదు. ఈ క్రమంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాతో జాహ్నవి కపూర్ లోకి అడుగుపెట్టింది. 2024లో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచినా జాహ్నవి అందానికి మాత్రం టాలీవుడ్ ఫిదా అయింది. దీంతో ఈ బ్యూటీ ఇక్కడ కూడా వరుస ఆఫర్లను అందుకుంటుంది. దేవర తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ చిత్రంలో హీరోయిన్ అందచందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లోనూ జాహ్నవి కపూర్ ఫుల్ బిజీగా ఉంది.

 

ఇద్దరూ ఒకే సినిమాలో

ఇక ఇప్పుడు జాహ్నవి కపూర్ శీలీల కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఉమేష్ బిస్త్ తీయబోతున్న ఓ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో ఈ ఇద్దరు ముద్దు గుమ్మలు నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో సిద్ధార్థ గుప్తా నటించబోతున్నట్టు కూడా సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమాలో కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లు ఓకే యువకుడిని ఇష్టపడతారట. ఇద్దరూ ఒకే అబ్బాయిని పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తారట. ప్రస్తుతం ఇదే వార్త ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాను హిట్ ప్రొడ్యూసర్లు ఏక్తా కపూర్, ఆస్కార్ విన్నర్ గునీత్ మోంగా నిర్మించబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుగా కనుక ఓకే అయితే ఇటు శ్రీ లీల అటు జాహ్నవి కపూర్ అందాలు ఓకే స్క్రీన్ పై చూసే అవకాశం ప్రేక్షకుడికి ఉంటుంది. మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందా…? లేదా…? అన్నది చూడాలి.