టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న యువ హీరో తేజ సజ్జా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇప్పటికే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యువ కథానాయకుడు త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా తన వివాహానికి సంబంధించిన విషయాలపై తేజ స్పందించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఆయన పెళ్లి ఎప్పుడు జరగనుంది? కాబోయే భార్య ఎవరు? పెళ్లి వేడుకలను ఎలా నిర్వహించబోతున్నారు? అనే వివరాల్లోకి వెళితే..
పెళ్లి వార్తను ధ్రువీకరించిన తేజ
తేజ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఇటీవల సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే తాజాగా ఈ విషయంపై ఆయనే స్పష్టత ఇచ్చారు. తాను నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఈ వివాహం ప్రేమ వివాహం కాదని, తమ తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధమని తెలిపారు. దీంతో తేజ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం అభిమానులకు తెలిసినట్లయింది. ఇప్పటివరకు తన వ్యక్తిగత విషయాలను పెద్దగా బయటకు వెల్లడించని ఆయన.. ఇప్పుడు పెళ్లి వార్తను ధ్రువీకరించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్‌లో నిశ్చితార్థం.. డిసెంబర్లో పెళ్లి!
తేజ వివాహ వేడుకలకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. నవంబర్‌లో నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం డిసెంబర్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం జరగనుంది. ఈ వేడుకను అత్యంత నిరాడంబరంగా, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిర్వహించాలని తేజ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోగా ఎదిగినప్పటికీ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వేడుకలను హడావుడికి దూరంగా జరుపుకోవాలని ఆయన నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఉదయ్‌పూర్‌లో వివాహం అనంతరం హైదరాబాద్‌లో సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు, ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు.
సినీ పరిశ్రమతో సంబంధం లేని అమ్మాయి!
తేజకి కాబోయే భార్య గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆమెకు సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని తేజ తెలిపారు. ఆమె కుటుంబం సాంకేతిక రంగంలో వ్యాపారం నిర్వహిస్తోందని, ఆమె తన తండ్రితో కలిసి పనిచేస్తున్నారని వివరించారు. అంతేకాకుండా ఆమె అమెరికాలో పెరిగారని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన హడావుడి, ప్రచారానికి దూరంగా ఉండే ఆమె స్వభావం తనకు నచ్చిందని తేజ వెల్లడించారు. అయితే తన కాబోయే భార్య పేరును మాత్రం ఆయన బయటపెట్టలేదు. ఆమె వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.
హనుమాన్తో పాన్ ఇండియా గుర్తింపు
ఇక తేజ సజ్జ సినీ ప్రయాణం విషయానికి వస్తే.. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘జాంబీ రెడ్డి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజకు ‘హనుమాన్’ సినిమా భారీ గుర్తింపును తీసుకొచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ హీరో చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. దీంతో తేజకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది. అలా హనుమాన్ లాంటి బ్లాక్ పాస్టర్ విజయం తర్వాత ఈ యువ నటుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ‘మిరాయ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. దాంతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం తేజ చేతిలో క్రేజీ సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక ఈ యువ నటుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ యువ హీరోగా తన ప్రయాణాన్ని అద్భుతమైన రీతిలో ముందుకు కొనసాగిస్తున్నారు.
కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న తేజ
సినిమాల పరంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న తేజ, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్లో వివాహం జరగనున్న నేపథ్యంలో అభిమానులు ఆయన పెళ్లి వేడుకల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కాబోయే భార్య వివరాలను వెల్లడించకుండా ఆమె వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలని తేజ నిర్ణయించుకోవడం గమనార్హం. మొత్తానికి, వెండితెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యువ హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతుండటంతో టాలీవుడ్లో ఈ వార్త ఆసక్తికరంగా మారింది.



