సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు అవకాశాలు ఉంటాయో… ఎప్పుడు పోతాయో చెప్పలేము. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అప్పటివరకు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఓ హీరోయిన్ ఆ తర్వాత అవకాశాలు లేకుండా ఖాళీగా ఉండవచ్చు. అప్పటివరకు ఐరన్ లెగ్ గా పిలుచుకున్న హీరోయిన్ ఒక హిట్ తోనే గోల్డెన్ లెగ్ గా మారిపోవచ్చు. రాత్రికి రాత్రి ఇండస్ట్రీలో తలరాతలు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు వరుస హిట్లు పడితే … కొన్నిసార్లు వరుస ప్లాపులు వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డేకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణిస్తూ బుట్ట బొమ్మగా క్రేజ్ సంపాదించుకున్న పూజా హెగ్డే ఇప్పుడు వరుస ఫ్లాప్ లతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
పూజ హెగ్డే కెరీర్..ఆమె నటించిన సినిమాలు
పూజా హెగ్డే తమిళ సినిమా మూగమూడి ద్వారా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. 2012లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ముకుంద సినిమాలోనూ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. వీటిలో ముకుంద సినిమా మొదట ప్రేక్షకుల ముందుకు రాగా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ పూజ హెగ్డే అందానికి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళుతుందని అప్పుడే అంచనాలు కూడా వేశారు. ఇక నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా ఆ తర్వాత విడుదలైనప్పటికీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో పూజా అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే తన కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోలతో జోడి కట్టారు. టాలీవుడ్లో ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేత అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు, మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమాలోను చాన్స్ కొట్టారు, అంతేకాకుండా ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాలోను ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని కెరీర్లో మరో మెట్టు ఎక్కింది. ప్రస్తుతం అఖిల్ లాంటి కుర్ర హీరోలతోనూ ఈ బ్యూటీ నటిస్తూ …అటు రొమాంటిక్, ఇటు ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలలో ప్రేక్షకులను మెప్పిస్తోంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా అటు కోలీవుడ్ మరోవైపు బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ సినిమాలు చేసింది.
సరైన హిట్ లేకపోవడంతో టెన్షన్
అయితే గత కొంతకాలంగా పూజ హెగ్డే కు సరైన హిట్ పడలేదు అనే చెప్పాలి. ఈ బ్యూటీ నటించిన అలా వైకుంఠపురం లో, తమిళ్ లో బీస్ట్ సినిమాల తర్వాత ఆమె ఖాతాలో సరైన హిట్ లేదుm బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించినా హౌస్ ఫుల్ 4 తప్ప మంచి హిట్ పడలేదు. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం చేతిలో పరిమితంగా అవకాశాలు
అయితే ప్రస్తుతం కొన్ని సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ అవి ఫ్లాప్ అయితే బుట్ట బొమ్మ పరిస్థితి ఏంటి అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం పూజా హెగ్డే తమిళంలో కాంచన 4 సినిమాలో నటిస్తోంది. అదేవిధంగా తెలుగులో శ్రీశ్రీ అనే సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాల విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఆ మూడు సినిమాలపైనే ఆశలు
మరోవైపు అర్హన్ హీరోగా నటిస్తున్న సుంకి అనే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 2024లో ఈ సినిమాకు ఒప్పందం చేసుకుంది. ఈ సినిమా 2025 లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. అక్టోబర్ 30 నుండి ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే ఆశలన్నీ ఈ మూడు సినిమాలపైనే ఉన్నాయి. అయితే ఈ మూడు కూడా పెద్దగా కమర్షియల్ సినిమాలు కాదు. ఈ సినిమాలు మంచి విజయం సాధిస్తే బ్యూటీకి మళ్ళీ ఆఫర్లు క్యూ కట్టే అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఈ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడితే పూజా హెగ్డే పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చూడాలి మరి పూజా హెగ్డే నటిస్తున్న ఈ మూడు సినిమాలకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అన్నది.



