సినిమా ఇండస్ట్రీలో హీరోలపై కామెంట్స్ చేయాలంటే భయపడతారు కానీ హీరోయిన్లపై చాలామంది నోరు పారేసుకుంటారు. హీరోల జోలికి వెళితే స్టార్ట్ డమ్, ఫాన్స్ తో ఇబ్బందులు తలెత్తుతాయని అసలు వారి జోలికి వెళ్లరు. కానీ హీరోయిన్లను మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అయితే అలాంటి కామెంట్లను కొంతమంది హీరోయిన్లు సీరియస్ గా తీసుకుంటే మరి కొంతమంది మాత్రం లైట్ తీసుకుంటారు. వారి పాపాన వారే పోతారని భావిస్తుంటారు. అంతేకాకుండా అలాంటివన్నీ పట్టించుకుంటే ఎదగలేమని తమ సినిమాలు తాము చేసుకుంటూ కెరీర్ పై దృష్టి పెడతారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్నాకు చేదు అనుభవం

మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా ఇండస్ట్రీలో అలాంటి చేదు అనుభవం ఎదురైంది. దానిపై ఆ బ్యూటీని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆసక్తికర సమాధానమిచ్చింది. ఇంతకీ ఆ బ్యూటీ పై కామెంట్లు చేసింది ఎవరు? ఆ బ్యూటీ ఇచ్చిన సమాధానం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

ఒకప్పుడు సౌత్ ను ఊపేసిన బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ

తమన్నా అనగానే టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా ఏ ఇండస్ట్రీ అయినా మిల్కీ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు స్టార్ హీరోలతో ఈ భామ జోడి కట్టింది. రామ్ చరణ్, మహేష్ బాబు , పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇలా దాదాపు టాలీవుడ్ లోని అందరు స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది. ఈ బ్యూటీ ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. తమిళ్ లోనూ అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తమన్నా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు ఐటమ్ సాంగ్స్ లోనూ సందడి చేస్తోంది. ఒకప్పుడు సౌత్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. ఇటీవలే “ది వివాన్” అనే మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించగా తమన్నా హీరోయిన్గా నటించి మెప్పించింది.

బాలీవుడ్ నటుడు అసభ్యకర కామెంట్స్

ఇదిలా ఉంటే తమన్నా బాడీ గురించి బాలీవుడ్ నటుడు అన్నూ కపూర్ తమన్నా గురించి అసభ్యకర రీతిలో మాట్లాడాడు. స్త్రీ- 2 అనే సినిమాలోని ” ఆజ్ కీ రాత్” పాటలో తమన్నా డాన్స్ చూసిన ఆయన…. పాల లాంటి ఆమె ముఖం, శరీరం పిల్లలు హాయిగా నిద్ర పోవడానికి సహాయపడతాయని చెప్పాడు. ఈ కామెంట్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ అన్నూ కపూర్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ …ఒకవేళ తన మాటల వల్ల తమన్నా ఇబ్బంది పడి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

అసభ్యకర కామెంట్ల పై తమన్నా రిప్లై

ఇక అన్నూ కపూర్ వ్యాఖ్యలపై రీసెంట్ ఇంటర్వ్యూలో తమన్నా స్పందించింది. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్లను తాను ఏమాత్రం పట్టించుకోను అని చెప్పింది. ఇలాంటి వాటిని వడపోసి తన పని తాను చూసుకుంటానని, పని పైనే దృష్టి పెడతానని వెల్లడించింది. ఇటీవల తమన్నా ఇంటర్వ్యూ కి వెళ్ళగా అందులో… ఒక సృజనాత్మక వ్యక్తిగా మనం వినడం చాలా ముఖ్యం. అయితే ఏది పట్టించుకోవాలి, ఏది వదిలేయాలి? అనే విషయంలో ఒక క్లారిటీ ఉండాలి. ఒక మహిళగా మనం ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ పోతే జీవితంలో ముందుకు సాగిపోలేము. నేను నా పని పైన దృష్టి పెడతా… ఏం చేయాలనుకుంటున్నాను దాని గురించే ఆలోచిస్తా. నటనను కేవలం కెరీర్ గా మాత్రమే కాకుండా ఒక సేవగా భావిస్తా అంటూ చెప్పుకు వచ్చింది. దీంతో తమన్నా ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతోంది. తమన్నా స్థానంలో వేరే వాళ్ళు ఉంటే బాధపడటం లేదా ఆ నటుడు ఫైర్ అవ్వడం లాంటివి చేసేవాళ్లేమో ..కానీ తమన్నా అలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ గా ఉంటూనే ఆ నటుడికి మైండ్ బ్లాక్ అయ్యే రిప్లై ఇచ్చారు. దీంతో తమన్నా రిప్లై పై ఆమె అభిమానులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.