సినిమా ఇండస్ట్రీలో హీరోలకు హిట్ కొట్టిన తర్వాత మరో హిట్ పడటమే చాలా కష్టం. అలాంటిది హ్యాట్రిక్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా మోజులో హీరోలు వరుస హిట్ లు కొట్టడం అనేది అంత ఆషామాషీ కాదు. కానీ ఇద్దరు హీరోలు మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. వరుస హిట్లు కొడుతున్న సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడం ప్రేక్షకులను మెప్పించడం విశేషం.

వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టిన సూర్య

ఇటీవల హ్యాట్రిక్ కొట్టి తమిళ హీరో సూర్య ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన తెలిసిందే. అంతేకాకుండా సూర్య కేవలం 6 నెలల్లోనే మూడు హిట్లతో హ్యాట్రిక్ విజయాలను అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 2026 మేలో సూర్య కరుప్పు అనే సినిమాలో నటించాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఈ ఏడాదే ఆగస్టులో విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా అత్యధిక వసూళ్లు సాధించి సూపర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన కొన్ని నెలలకే నవంబర్ లో సూర్య జీతూ మాధవన్ దర్శకత్వంలో సీన్ అనే సినిమాలో నటించారు. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ క్రైమ్ కామెడీ చిత్రానికి 250 కోట్లకు పైగా వసూళ్ళు వచ్చాయి. ఈ సినిమా విజయంతో సూర్య హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కూడా

సూర్య ఇలా హ్యాట్రిక్ విజయాతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారిన కొద్ది రోజులకే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. దుల్కర్ సల్మాన్ మలయాళ స్టార్ అయినప్పటికీ ప్రస్తుతం ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. 2018లో దుల్కర్ సల్మాన్ మొదటిసారి మహానటి అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ 2022లో సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా విజయం తర్వాత మళ్లీ దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాను ప్రేక్షకులు మర్చిపోకముందే తెలుగులో ఆకాశంలో ఒక తార సినిమతో దుల్కర్ సల్మాన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇలా సూర్య దుల్కర్ సల్మాన్ వరుస హిట్లు కొట్టడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.