నితేష్ తివారి దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా రామాయణ. పాన్ ఇండియా స్థాయిలో తీసిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నవంబర్ 5 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం హిందీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇటీవల చాలా సినిమాలు విడుదలైనప్పటికీ రామాయణ ఆ సినిమాలకు పోటీ ఇస్తూ థియేటర్లలో నిలబడింది. ఇక తాజాగా సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామాయణ సినిమాలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటించగా రావణుడి పాత్రలో యష్ నటించి మెప్పించారు.
ముఖ్యంగా సినిమాలో యష్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా చూసిన చాలా మంది అతడి నటనపై ప్రశంసలు కురిపించారు. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా సినిమాలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. ఆయనే పంచాయతీ వెబ్ సిరీస్ తో ప్రహ్లాద్ చావ్లాగా గుర్తింపు సంపాదించుకున్న ఫైసల్ మాలిక్. రామాయణ సినిమాలో పైసల్ మాలిక్ కుంభకర్ణుడి పాత్రలో నటించాడు.
యష్ ను వెనక్కి నెట్టేసిన ఫైసల్ మాలిక్
కాగా తాజాగా పైసల్ మాలిక్ ఐఎండీ వారపు ట్రెండింగ్ జాబితాలో కన్నడ స్టార్ యష్ ను సైతం వెనక్కి నెట్టేసి టాప్ స్థానంలో నిలిచాడు. మరోవైపు యష్ రెండవ స్థానానికి వెళ్లిపోయాడు. ఓటిటిలో పంచాయతీ వెబ్ సిరీస్ లో తన నటనతో మెప్పించిన ఫైసల్ రామాయణలో కుంభకర్ణుడి పాత్రతో అదరగొట్టడంతో స్టార్ హీరోలకే పోటీగా మారాడు.
సోషల్ మీడియాలోనూ ఫైసల్ ట్రెండింగ్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పైసల్ మాలిక్ గురించే కనిపిస్తోంది. ముఖ్యంగా రామాయణ సినిమా ఎంట్రీ లో ఫైసల్ సన్నివేశానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పైసల్ పంచాయతీ సిరీస్ చేసినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన రీల్స్, మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు రామాయణ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమాలో కుంభకర్ణుడి చేతిపై రావణుడు నడుస్తూ అతడిని ఆశీర్వదించే సీన్ సహా అనేక సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే ఫైసల్ ఇప్పుడు ఐఎండి ట్రెండింగ్ లో నిలవగా ఆయనకు బాలీవుడ్ లో ఆఫర్లు కూడా పెరిగిపోయాయి.
ఫైసల్ పర్సనల్ లైఫ్
ఇక ఇతడి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈయన ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జన్మించాడు. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రాత్రిళ్ళు కేవలం 10 రూపాయలు చెల్లించి రైల్వే స్టేషన్ సమీపంలో నిద్రించేవాడినని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. నటుడిగా మారకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా, ప్రోమో ప్రొడ్యూసర్ గా రియాలిటీ షో లైవ్ ప్రొడ్యూసర్ గా పని చేసినట్టు చెప్పాడు. అంతే కాకుండా రివాల్వర్ రాణి, మైన్ ఔర్ చార్లెస్, స్మోక్ తో పాటు కొన్ని ప్రాజెక్టులకు సహనిర్మాతగా వ్యవహరించినట్టు వెల్లడించాడు. ఈయనకు మొదటగా గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్ పార్ట్ 2 సినిమాతో గుర్తింపు వచ్చింది. పంచాయత్ తర్వాత కెరీర్ మలుపు తిరిగింది. ఇక రామాయంతో వచ్చిన పేరుతో ముందు ముందు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.



