మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తారు. పాత్ర ఏదైనా సరే దానికి తగ్గట్టుగా తనని తాను మార్చుకోవడంలో రామ్ చరణ్ ఎప్పుడు ముందంజలోనే ఉంటారు. సినిమాకు తగ్గట్టుగా తన లుక్ ని బాడీ లాంగ్వేజ్ ని మార్చుకుంటూ ప్రతి సినిమాకు కొత్తదనాన్ని చూపిస్తుంటారు. పాత్ర ఏదైనా దానిపైనే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మరీ పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే రామ్ చరణ్ గురించి చాలా విషయాలు ఉంటాయి. అయితే ఇప్పుడు చెర్రీ మరోసారి తనని తను మార్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న కొత్త మూవీ కోసం ఈ సినిమాలో రామ్ చరణ్ భారీ ట్రాన్స్ఫర్మేషన్ కు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది.

డిఫరెంట్ కథలతో సుకుమార్

సుకుమార్ అంటే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది డిఫరెంట్ స్టోరీస్.. హీరోల లుక్ లో ఒక కొత్తదనం. సుకుమార్ తెరకెక్కించిన ఆర్య, రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల విషయానికి వస్తె తనదైన స్టైల్ తో తెరకెక్కించిన ఈ సినిమాలకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక డిఫరెంట్ స్టోరీని చూస్ చేసుకొని పాత్రకు తగ్గట్టుగా ఉండే హీరోని సెలెక్ట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టడమే సుకుమార్ స్పెషాలిటీ. ఇక రంగస్థలం మూవీ తర్వాత రామ్ చరణ్ తో కలిసి సుకుమార్ మరోసారి జతకట్టడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సుకుమార్ చెర్రీ కాంబోలో rc 17

వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రస్తుతం RC17 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జర్నీ మొదలు పెట్టనున్నారు. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ నుండి మొదలు కాబోతుండడంతో ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే చెర్రీ సినిమా కోసం ప్రత్యేకంగా తన లుక్ ను మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారన్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం దాదాపు మూడు రోజులపాటు సమయం కేటాయించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఒక రహస్య ప్రదేశాన్ని కూడా ఎంచుకున్నారట. ఎవరికీ తెలియని ఓ ప్రదేశంలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రిపేర్ జరగనున్నట్లు సమాచారం. ఇందుకోసమే రామ్ చరణ్ ప్రత్యేకంగా తన ట్రైనర్, చెఫ్ లతో పాటు అవసరమైన సహాయక సిబ్బందిని కూడా ఆ ప్రదేశానికి తీసుకెళ్ళనున్నారట.

ఇప్పటికే లుక్ మార్చిన చరణ్

ఇప్పటికే పెద్ది సినిమా కోసం లాంగ్ హెయిర్ తో బాడీ పెంచిన చరణ్ ఇప్పుడు బరువు తగ్గేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో చరణ్ బరువు తగ్గినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు మళ్ళీ రహస్య ప్రదేశంలో ట్రాన్స్ ఫార్మేషన్ అంటూ వార్తలు రావడంతో చరణ్ ఇంకా ఎలా తన లుక్ మార్చుకోబోతున్నారు అనే ఆసక్తి నెలకొంది. సుకుమార్ రామ్ చరణ్ ను ఎలాంటి స్టైల్లో చూపించబోతున్నారు. సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే వివరాలు తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.