గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో యలహంక ప్యాలెస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. షర్మిల తన కూతురు అంజలి వివాహాన్ని బెంగళూరులోని ఈ ప్యాలెస్ లో చేస్తానని ప్రకటించిన తర్వాత అసలు వివాదం మొదలైంది. జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిలకు హక్కు లేదని చెబుతుంటే… షర్మిల మాత్రం తాను చిన్ననాటి నుండి అక్కడే పెరిగానని తన పిల్లలు సైతం ఏడేళ్ల పాటు అక్కడే ఉన్నారని చెబుతున్నారు. తన కూతురు కోరికమేరకే అక్కడ ఆమె వివాహం జరిపించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

షర్మిలకు విజయమ్మ సపోర్ట్

షర్మిలకు మద్దతుగా విజయమ్మ కూడా ఈ ప్యాలెస్ లో షర్మిలకు హక్కు ఉందని చెబుతోంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఆ టాపిక్ గా మారింది. మరోవైపు ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి జరిపించడానికి జగన్ నిరాకరిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. తన సెక్యూరిటీ కారణాలవల్ల ప్యాలెస్ లో అంజలి వివాహం జరిపించడానికి వీలులేదని స్పష్టం చేశారు. దీంతో షర్మిల వెనక్కి తగ్గి తన కూతురి వివాహ వేదికను మార్చుకున్నారు. కానీ ప్యాలెస్ లో తనకు హక్కు ఉంది అని వాదించారు. ఈ క్రమంలో జగన్ కోర్టుకు వెళ్లి షర్మిల ప్యాలెస్ లో అడుగు పెట్టడానికి వీలు లేకుండా చేశారు. దీంతో ఆ ప్యాలెస్ లో తనకు వాటా ఉందని షర్మిల చెబుతున్నా జగన్ కు అనుకూలంగా కోర్టు తీర్పు ఎలా వచ్చింది? అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి. అయితే నిజానికి యలహంక ప్యాలెస్ లో నైతికంగా షర్మిలకు హక్కు ఉన్నప్పటికీ చట్టాల పరంగా ఆమెకు ఎలాంటి హక్కు లేదని తెలుస్తోంది. గతంలో ఈ ఆస్తికి సంబంధించిన పత్రాలు వైఎస్ భారతి తల్లి ఈసీ సుగుణమ్మ పేరు మీద ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ ఆస్తిని భారతి పేరు మీదకు ఆమె కుమార్తెల పేరు మీదకు వారసత్వంగా బదిలీ చేసినట్టు తెలుస్తోంది.

ఇంటికి కొనుగోలు చేసింది వైఎస్ఆర్

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఇంటిని కట్టించారట. కానీ అప్పటి సాంకేతిక రాజకీయ కారణాలవల్ల కుటుంబ సభ్యులు పెద్దలతో చర్చల తర్వాత బినామీ ఆస్తి కింద, నమ్మకంతో భారతి తల్లి ఈసీ సుగుణమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలుస్తుంది. ఇది నిజానికి వైఎస్ఆర్ కొనుగోలు చేసిన ఆస్తి అని షర్మిల వాదిస్తోంది. తాను ఏడేళ్లు అదే ఇంటిలో నివసించానని కూడా చెబుతోంది. కానీ రికార్డుల పరంగా వైఎస్ భారతి తల్లి పేరు ఉండటం, వారి నుండి భారతి మరియు ఆమె కూతుళ్ళ పేరు మీదకి బదిలీ చేయడంతో షర్మిలకు చట్టపరంగా అసలు ఎలాంటి హక్కులు లేవని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై న్యాయ నిపుణులు సైతం చేతులెత్తేసినట్టు ప్రచారం జరుగుతుంది.

చట్టపరంగా ఏం చేయలేని పరిస్థితి

నిజానికి షర్మిలకు నైతిక హక్కులు ఉన్నప్పటికీ చట్టపరంగా ఇప్పుడు ఆమె ఏమీ చేయరని స్థితిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కోర్టు తీర్పు జగన్ కు అనుకూలంగా రావడంతో షర్మిల ఆస్తిపై ఆశలు వదిలిపెట్టుకున్నట్టేనా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో షర్మిల ఇకపై ఏమి చేయలేరని, సోదరుడిని రాజకీయంగా ఎదుర్కోవడం తప్ప ఆమెకు మరొక మార్గం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి అనేక నాటకీయ పరిణామాల తర్వాత షర్మిల, విజయమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.