సినిమా ఇండస్ట్రీ లోకి చాలామంది హీరోలు, దర్శక నిర్మాతల కుమారులు వస్తుంటారు. కానీ అలా వచ్చిన వారిలో కొంతమంది మాత్రమే తమ టాలెంట్ నిరూపించుకుని సక్సెస్ అవుతారు. అలా టాలీవుడ్ లో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన హీరో నాగచైతన్య. తాత నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున వారసత్వం పుణికిపుచ్చుకుని చైతూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. 2009లో 23 ఏళ్ల వయసులో చైతు జోష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమాలో ఇతడి నటనపై ఎన్నో విమర్శలు వచ్చాయి.
చైతూ లుక్ పై సైతం చాలామంది విమర్శలు చేస్తూ ట్రోల్ చేశారు. కానీ ఆ తర్వాత తనను తాను మార్చుకుని ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. జోష్ తర్వాత నాగచైతన్య కెరీర్ లో వచ్చిన ఏం మాయ చేశావే సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్ సినిమా కూడా చైతూకి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వరుస లవ్ స్టోరీలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. మధ్య మధ్యలో మాస్ ఓరియంటెడ్ సినిమాలలోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరించాడు.
అక్కినేని వారసత్వం కొనసాగిస్తున్న హీరో
గ్లామర్, ప్రేమ కథ చిత్రాలతో అక్కినేని వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు అనే ప్రశంసలు అందుకుంటున్నాడు. కేవలం ఒకే రకమైన సినిమాలకు అతుక్కుపోకుండా తండేల్ లాంటి డిఫరెంట్ కథలతోనూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు సైతం చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నాడు.
40ఏళ్లకు చేరువైన నాగచైతన్య
ఇక చైతూ నవంబర్ 23న జన్మించగా ఈరోజు తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీంతో అభిమానులు సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు ఆయన నటిస్తున్న, నటించబోయే సినిమాల నుండి మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అప్డేట్స్ ఇస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక చైతూ పుట్టినరోజు సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి గతంలో నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే.
వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే అదే సమయంలో విడాకుల తర్వాత నాగచైతన్య స్టార్ మారిపోతుందని కూడా వేణు స్వామి చెప్పాడు. ఇక ఇప్పటివరకు చైతూ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నప్పటికీ స్టార్ హీరో రేంజ్ ను మాత్రం అందుకోలేకపోయాడు. అయితే అదే విషయంపై రీసెంట్ గా ఇంటర్వ్యూలో వేణు స్వామిని ఓ యాంకర్ ప్రశ్నించాడు. దీంతో ఇప్పటివరకు నాగచైతన్య జాతకంలో గ్రహాలు మారలేదని కానీ జనవరి తర్వాత గ్రహాలు మారతాయని చెప్పాడు.
దీంతో 2027 జనవరి తర్వాత నాగచైతన్య స్టార్ మారబోతుందా? అని అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య వృషకర్మ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది మరి ఈ సినిమా ఎలాంటి విషయం సాధిస్తుందో చూడాలి. అంతేకాకుండా జనవరి తర్వాత నాగచైతన్య కెరీర్ ఎలాంటి మరుపు తిప్పుతుంది అనేది కూడా చూడాలి.



