టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత. ఇటు తెలుగు, అటు తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత జీవితంలో ఇప్పుడు మరో కొత్త అధ్యాయం మొదలైంది. సమంత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అయితే గత ఏడాది డిసెంబర్లో సమంత దర్శకుడు రాజ్ నిడిమోర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తనకు బాబు పుట్టినట్లు వెల్లడిస్తూ తన కుమారుడిని చేతుల్లో పట్టుకొని ఉన్న ఫోటోనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో సమంత అభిమానులు అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గతంలోనే సమంత జాతకం చెప్పిన జ్యోతిష్యుడు

అయితే ఇదిలా ఉండగా.. గతంలో ఓ జ్యోతిష్యుడు సమంతకు మగ బిడ్డ పుడతాడు అని చెప్పిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. సమంత తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ తన అందం నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు సరసన నటించి టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకుంది. సమంత తన అందంతో మాత్రమే కాకుండా తన యాక్టింగ్ తో కూడా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ అటు తమిళ్ ఇటు తెలుగు భాషలో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ఇకపోతే సమంతకు మగ బిడ్డ పుడతాడని గతంలో ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మొదటి బిడ్డ మగబిడ్డ అని అప్పుడే

2014లో యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసిన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ప్రోగ్రాం కి సమంత వెళ్ళింది. అయితే ఆ షోలో ఓ జ్యోతిష్యుడు ఆమె ముఖాన్ని చూసి సమంతాకు మొదటి సంతానం మూగబిడ్డ పుడతాడని జాతకం చెప్పాడు. ఆ సమయంలో సమంత మాత్రం తనకు ఆడపిల్ల కావాలని సరదాగా చెప్పింది.. కానీ ఇప్పుడు సమంత మూగ బిడ్డకు జన్మనివ్వడంతో జ్యోతిష్యుడు చెప్పినట్టుగానే సమంతకు మగ బిడ్డ పుట్టాడంటూ అప్పటి వీడియోలు , మాటలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

కొడుకు పుట్టిన వెంటనే పేరు ప్రకటించిన సామ్

ఇక  సమంత తన కుమారుడికి దేవ్ అనే పేరు కూడా పెట్టింది. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే సమంత ప్రొఫెషనల్ లైఫ్ లో లానే పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో మలుపులు ఉన్నాయి. తన మొదటి సినిమా ఏ మాయ చేసావే హీరో నాగచైతన్యను 2017లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2021లో సామ్ నాగచైతన్య విడిపోయారు.

రాజ్ నిడుమోరుతో పరిచయం పెళ్లి

ఆ తర్వాత కొంతకాలం సమంతా ఒంటరిగానే ఉండిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ రెండో సీజన్ సమయంలో దర్శకుడు రాజ్ నిడుమోరాతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వివాహ బంధానికి దారి తీసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత రాజ్ నిడుమోరా ను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఈ ఎడాది సమంతకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఒకవైపు కెరియర్ లో విజయాలు సాధిస్తూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషకరమైన క్షణాలను పొందుతుంది. ఇక సమంత అభిమానులు కూడా ఆమె జీవితంలో మొదలైన ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.