టాలీవుడ్ లో అతి తక్కువ సినిమాలతో అందరిని ఆకట్టుకున్న హీరోయిన్ ల గురించి మాట్లాడితే నివేదా థామస్ ముందంజలో ఉంటారు. తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నివేదా థామస్ మరో మైండ్ బ్లోయింగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పాత్రలు ఎంత చిన్నవైనా సరే నటనకు ప్రాధాన్యత ఉంటే చాలు ఆ పాత్రను ఎంచుకొని ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో నివేదా పెట్టింది పేరు. చిన్న చిన్న ఎమోషన్స్ కి కూడా నివేద థామస్ తన యాక్టింగ్ తో హైప్ పెంచేస్తారు. నివేద థామస్ నాని జెంటిల్ మెన్, నిన్ను కోరి, జై లవకుశ, బ్రో, వకీల్ సాబ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

ముఖ్యంగా పాత్ర ఏదైనాప్పటికీ దానికి తగ్గట్టుగా ఎమోషన్స్ని పండించే విధానం నివేదా థామస్ యాక్టింగ్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక ఇటీవల నివేద థామస్ నటించిన 35 చిన్న కథ కాదు సినిమా ప్రేక్షకులను ఎంతగా కట్టిపడేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో నివేద థామస్ నటనపై విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి. ఒక సాదాసీదా హౌస్ వైఫ్ గా ఈ సినిమాలో నివేద థామస్ నటించిన తీరు అందరిని మెప్పించిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు అలాంటి ఇంకో సహజమైన పాత్రలో నివేద థామస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

శ్రీమతి సినిమాతో మరోసారి నివేద ప్రేక్షకుల ముందుకు

శ్రీమతి అనే సినిమాతో తన సహజమైన నటను మరోసారి చూపించుకునేందుకు నివేద సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలను చూస్తుంటే మాత్రం మలయాళం లో తెరకెక్కించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాను గుర్తు చేస్తున్నట్లుగా ఉందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే వంటగది సన్నివేశాలు, ఇంటి పనులు, కుటుంబ బాధ్యతల భారంతో మహిళ ఎదుర్కునే ఇబ్బందులే కనిపిస్తున్నాయి.

రెండు సినిమాల్లోనూ అదే కామన్ పాయింట్

అయితే ఈ రెండు సినిమాల్లోనూ ఇవే కామన్ పాయింట్స్ గా ఉండడంతో శ్రీమతి సినిమా కూడా ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాను గుర్తు చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరైతే శ్రీమతి సినిమా ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రానికి రీమేక్ అయ్యుంటుందంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు శ్రీమతి సినీ యూనిట్ మాత్రం ఇది రీమేక్ అని అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాకు విశ్వక్ కాండేరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నివేద థామస్ తో పాటుగా తిరువీర్, హరితేజ, గోపరాజు, రమణ, విజ్జి చంద్రశేఖర్ , రాజీవ్ కనకాల, రేణు దేశాయ్ తదితరులు ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. శ్రీమతి మూవీని కే. నిరంజన్ రెడ్డి , చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.

తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే

ఇక ఈ మూవీ డిసెంబర్ 4 ,2026 నుంచి G5లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమా విషయానికొస్తే.. పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన ఓ మహిళ వంటగది, ఇంటి పనులకే పరిమితం అవుతూ.. తన కలలను చంపుకుంటుంది. కుటుంబంలోని పురుషాధిక్య ఆలోచనలతో విసిగిపోయిన ఆమె చివరకు తన ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తోంది. ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. తాజాగా శ్రీమతి ట్రైలర్ రిలీజ్ కావడంతో రీమిక్స్ చర్చ మొదలైంది. అసలు ఇది రిమేకా లేక కొత్త సినిమానా అన్నది తెలియాలంటే చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సిందే మరి.