కొన్నిసార్లు థియేటర్లు సినిమాలు లేక బోసిపోతే మరికొన్నిసార్లు తీవ్రమైన పోటీ ఉంటుంది. ప్రేక్షకులకు ఏ సినిమా చూడాలో.. ఏ సినిమాను వదిలేయాలో అర్థం కాదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. థియేటర్లలో ప్రస్తుతం మూడు సినిమాలు సందడి చేస్తున్నాయి. అందులో మూడు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్లో వచ్చాయి. ఇక ఆ మూడు సినిమాల్లో రెండింటికి సూపర్ హిట్ టాక్ వస్తే మరో సినిమాకు మాత్రం యావరేజ్ టాక్ వస్తుంది. ఆ సినిమాలు ఏంటి? ప్రేక్షకులు ఎటువైపు మొగ్గుచూపుతున్నారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం…
యూత్ ఫేవరెట్ గా ఈనగరానికి ఏమైంది రిపీట్
ఈవారం థియేటర్లలో విడుదలైన సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది రిపీట్ ఒకటి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ నగరానికి ఏమైంది ఫస్ట్ పార్ట్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉండడంతో ఈఎన్ఈ రిపీట్ పై కూడా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో కామెడీ, ప్రేక్షకుల మనసుకు హత్తుకునే ఎమోషన్స్, స్నేహితుల మధ్య సాగే క్రేజీ సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. యూత్ ఎక్కువగా ఈ సినిమాకు ఆకర్షితులు అవుతున్నారు. దీంతో థియేటర్ల వద్ద యువత సందడి కనిపిస్తోంది. మిగతా రెండు సినిమాలతో పోలిస్తే ఎక్కువగా యువత ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తున్న ఆకాశంలో ఒక తార
ఈ వారం విడుదలైన మూడు సినిమాల్లో మరొక సినిమా ఆకాశంలో ఒక తార. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది. భార్య కలను నిజం చేసేందుకు భర్త పడే కష్టాన్ని చూపిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. సందేశాత్మక చిత్రం కావడం, గూస్ బంప్స్ సన్నివేశాలు ఉండటంతో చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకు కూడా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. ఫస్ట్ షో తర్వాత సూపర్ హిట్ టాక్ రావడంతో బుకింగ్స్ కూడా భారీగా పెరిగిపోయాయి. దీంతో ఈ రిపీట్ తో పాటు ఈ సినిమా కూడా పోటీ పడుతుంది
ఈ వారం రేసులో ధనుష్ ఓం సినిమా కూడా
ఈ రెండు సినిమాలతో పాటు ధనుష్ హీరోగా నటించిన ఓం సినిమా కూడా ఈ వారమే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మమ్ముట్టి సైతం ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. బేసిక్ గా తమిళ సినిమా అయినప్పటికీ తెలుగులోనూ ధనుష్ కు అభిమానులు ఉన్నారు. అయితే యాక్షన్ సినిమా కావడం, సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో పై రెండు సినిమాల కంటే ఓం సినిమాకు తెలుగులో కాస్త క్రేజ్ తక్కువగానే ఉంది. అయితే తమిళ్ లో మాత్రం ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ తమిళ్ లో ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం ఈఎన్ఈ రిపీట్, ఆకాశంలో ఒక తార తర్వాత ఈ సినిమాను ఆప్షన్ గా చూస్తున్నారు. మరోవైపు యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు, మాస్ అభిమానులు కూడా ధనుష్ సినిమా వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు కూడా ఆడియన్స్ ను ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ మూడింటిలో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. ఏ సినిమా బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచింది అనేది తెలియాలంటే మాత్రం వారం తర్వాత కలెక్షన్లను బట్టి అంచనా వేసుకోవాల్సిందే.



