సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ అలా వచ్చిన వారిలో కొంతమంది ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంటారు. అలాంటి హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు. నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమా ద్వారా 2005లో అనుష్క టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో అనుష్క గ్లామర్ కు యూత్ అంతా ఫిదా అయ్యారు.

ఈ చిత్రం తర్వాత ఎవరు ఈ బ్యూటీ అని వెతకడం మొదలుపెట్టారు. ఈ సినిమా వచ్చిన ఏడాది తర్వాత 2006లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు సినిమాతో మరోసారి అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బ్యూటీ కెరీర్ లోనే మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అనుష్క గ్లామర్, నటనకు అంతా ఆశ్చర్యపోయారు. రెండో సినిమాకే తన నటనతో అనుష్క మెప్పించడంతో ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకున్నారు.

టాలీవుడ్ లో స్టార్స్ అందరితోనూ సినిమాలు

టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరితోనూ జోడి కట్టారు. ఇక 2009లో లేడీ ఓరియంటెడ్ సినిమాగా వచ్చిన అరుంధతి బ్లాక్ బస్టర్ విషయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇతర భాషల్లోనూ అనుష్కకు అభిమానులను తెచ్చిపెట్టింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ అనుష్క సినిమాలు చేసి ప్రశంసలు అందుకున్నారు. అనుష్క నటించిన వేదం, రుద్రమదేవి, సింగం, మిర్చి సినిమాలు మంచి విజయం సాధించాయి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఆమె విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేయడంతో అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి సినిమా లవర్ ఆమెను ఇష్టపడ్డారు. ఇక కెరీర్లో ఎన్నో ఫిల్మ్స్ ఫేర్ అవార్డులు ఆమె అందుకున్నారు. అంతేకాకుండా రెండు నంది అవార్డులు, రెండు సైమా అవార్డులతో పాటు తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామణి అనే పురస్కారాన్ని సైతం సొంతం చేసుకున్నారు.

బాహుబలితో పాన్ ఇండియాకు అనుష్క

ఈ క్రమంలోనే 2015లో బాహుబలి సినిమాలో ప్రభాస్ కు జోడిగా నటించి మెప్పించారు. బాహుబలి పార్ట్ వన్, పార్ట్ టూ లలో అనుష్క నటనకు పాన్ ఇండియా ఫిదా అయ్యింది. అయితే ఆ తర్వాత అనుష్క కెరీర్ పిక్స్ లోకి వెళ్తుంది అనుకుంటే ఆమె మాత్రం సినిమాలకు మెల్లిమెల్లిగా దూరమయ్యారు. చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాలో అనుష్క నటించారు. ఆ తర్వాత ఆమె స్క్రీన్ పై కనిపించలేదు. అప్పటినుండి అభిమానులు అనుష్క సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు.

హైదరాబాద్ లో ఇంటిని అమ్మేసిన అనుష్క

ఇంతలోనే ఓ షాకింగ్ వార్త ఇప్పుడు అభిమానులను కలవరపెడుతోంది. టాలీవుడ్ లో సక్సెస్ అయ్యాక అనుష్క హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. జూబ్లీహిల్స్ లో ఓ భారీ బంగ్లాను కొనుగోలు చేసి చాలాకాలంగా అక్కడే నివాసం ఉంటున్నారు. బేసిక్ గా అనుష్క సొంత రాష్ట్రం కర్ణాటక. కానీ ఆమె కన్నడ కంటే తెలుగులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. దీంతో ఇక్కడే సెటిల్ అయ్యారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లోని తన ఇంటిని అనుష్క అమ్మినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

చాలాకాలంగా ఉంటున్న ఇంటిని అనుష్క 12 కోట్లకు అమ్మేసినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో అనుష్క హైదరాబాద్ లోని ఇంటి నుండే సినిమా షూటింగ్ లకు వెళ్లేవారు. కానీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత పెద్దగా ఛాన్స్ లు లేవని అందుకే అనుష్క ఇంటిని అమ్మి వెళ్లిపోవాలని భావించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే మళ్ళీ స్వీటీ టాలీవుడ్ లో సినిమాలు చేసే అవకాశం లేదు. ఇది ఆమె అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. చూడాలి మరి ఈ వార్తలపై అనుష్క ఏమైనా క్లారిటీ ఇస్తారా? లేదా? అనేది.