యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుందంటే చాలు.. ఫాన్స్ కి పూనకాలే. ఎన్టీఆర్ అద్బుతమైన నటన, అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ మూవ్స్, డైలాగ్ డెలివరీ గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. అన్నింటికీ మించి పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఆయన ప్రత్యేకత. ప్రస్తుతం తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీసుని బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
డ్రాగన్ లో ఎన్టీఆర్ పాత్రపై ఆసక్తి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ స్టైల్ తోడైతే థియేటర్ లలో మొత్తమోగిపోవడం ఖాయం. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ వచ్చేసింది. డ్రాగన్ లో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయని ఫాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల చేయగా, మూవీపై అంచనాలు తారస్థాయికి చేరాయి.
ఈ సినిమాకు మరో మ్యూజిక్ డైరెక్టర్ కూడా..
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి అందించే సంగీతానికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త సినీ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది. ఇప్పటికే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ రవి బసుర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే రవి బసుర్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్ దేవ్ కూడా ఈ సినిమా కోసం ఆయనతో కలిసి మ్యూజిక్ కంపోస్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దురంధర్, కిల్, ఆర్టికల్ 370 సినిమాలలో మ్యూజిక్ కంపోస్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన అందించిన మ్యూజిక్ ఆల్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు కలిసి ఈ సినిమాలో పాటలను కంపోస్ట్ చేస్తున్నారని వార్త వినిపించడంతో మరింత మంచి స్పందన లభిస్తుంది.
డ్రాగన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు
ఇకపోతే , డ్రాగన్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడిగా కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ నటిస్తుంది. అలాగే అనిల్ కపూర్, బిజు మీనన్, కుష్బూ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ డ్రామాగా డ్రాగన్ మూవీ 2027లో వరల్డ్ వైడ్ గా థియేటర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ డ్రాగన్ మూవీతో ఎన్టీఆర్ మరోసారి తన నటనతో ఫిదా చేస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సంగీతమే ఈ సినిమాకు బలం
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరపైకి తీసుకొస్తున్న ఈ భారీ యాక్షన్ సినిమాకి ఎన్టీఆర్ యాక్టింగ్ ఒక ఎత్తు అయితే,, రవి బసుర్, శాశ్వత్ సచ్ దేవ్ సంగీతం ఇంకా బలాన్ని చేకూర్చుతుంది. ఆర్ఆర్ఆర్, దేవర లాంటి పవర్ ఫుల్ మూవీస్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ మూవీపై అటు ఇండస్ట్రీలో ఇటు అభిమానుల్లో ఉన్న నమకాన్ని ఎన్టీఆర్, నీల్ ఎలా నిలబెట్టుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో.. ఎంత వసూళ్లు రాబడుతుందో, బాక్స్ ఆఫీసు వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో తెలియలి అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. అప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ యే అభిమానులకు అసలైన పండుగ..!



