అందం టాలెంట్ ఉండాలిగానీ సీరియల్స్ లో నటించిన వాళ్లు సైతం సినిమాల్లో ఆఫర్లు అందుకుంటారు. సినిమాల్లో సక్సెస్ అయితే ఆ తర్వాత కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే అలాంటి అవకాశం కూడా అందరికీ రాదు. దానికి అదృష్టం సైతం ఉండాలి. అలా అందం అదృష్టంతో సినిమా ఛాన్స్ కొట్టేసిన నటి జ్యోతి పూర్వాజ్.

గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగులో పాపులర్

గుప్పెడంత మనసు సీరియల్ తో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. జగతి మేడం పాత్రలో ఆకట్టుకోవడంతో ఈమెకు చాలామంది అభిమానులు అయ్యారు. బేసిగ్గా కన్నడ నటి అయినప్పటికీ తెలుగు సీరియల్స్ లోనూ జ్యోతికి ఫ్యాన్స్ ఎక్కువే. కన్నడలో ఈమె మొదటగా “బందే బడతావా కాలా” సీరియల్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జోగుల, కిన్నరీ, కస్తూరి నివాసతో పాటు 20కి పైగా సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ సుక్కు అనే యంగ్ డైరెక్టర్ ను వివాహం చేసుకుంది.

సినిమా హీరోయిన్లకు తగ్గని అందం

సీరియల్ నటి అయినప్పటికీ సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలోనూ లక్షల కొద్ది ఫాలోవర్లను సంపాదించుకుంది. తరచూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ సంఖ్యను రెట్టింపు చేసుకుంది.

కిల్లర్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్

ఇక సీరియల్ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిన సినిమా కిల్లర్. ఈ సినిమాకు జ్యోతి భర్త పూర్వాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పద్మనాభరెడ్డితో కలిసి ఆయనే నిర్మించారు కూడా. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా జ్యోతి మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. యాంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు మీ భర్త దర్శకత్వం వహించారు కాబట్టి మీరు ఆయన ముందు ఎలా నటించారు? అని ప్రశ్నించారు. ముఖ్యంగా మీ భర్త ముందు బోల్డ్ సన్నివేశాలు ఎలా చేశారు? అని అడిగారు. దీనికి జ్యోతి మాట్లాడుతూ ఆసక్తికర సమాధానం చెప్పింది… తాను ఒక నటి అని సెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత తన బాడీ తన కంట్రోల్ లో ఉండదని చెప్పింది. ఇక్కడ తాను చెప్పేది వేరే ఉద్దేశంతో కాదని, కేవలం తన మైండ్ లో ఒక నటిగా మాత్రమే ఆలోచిస్తానని తెలిపింది. ఆ క్యారెక్టర్ ఏంటనేదానిపైనే తన ఫోకస్ ఉంటుందని తెలిపింది. ఓ సీరియల్ లో నటించినప్పుడు తాను చేసే క్యారెక్టర్ డబ్బుల కోసం సరోగసీకి ఒప్పుకుంటుందని, ఆ క్యారెక్టర్ లో తాను ప్రెగ్నెంట్ గా కనిపించేందుకు చాలా కష్టపడినట్టు తెలిపింది. తన ముఖంలో, శరీరంలో అలాంటి హావభావాలు కనిపించాలి కాబట్టి దానికోసం చాలా ప్రయత్నించినట్టు తెలిపింది. తాను బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆ పాత్రను గుర్తు చేసుకోవాలి కాబట్టి అందులో ఒదిగిపోతానని చెప్పింది.

కిల్లర్ కు కోటి ఆఫర్

ఇక కిల్లర్ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఈ సినిమాలో ఓ ట్విస్ట్ ఉందని డైరెక్టర్ చెప్పడమే. ఆ ట్విస్ట్ ఎవరైనా ముందే కనిపెడితే వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ డైరెక్టర్ ప్రచారం చేశాడు. దీంతో ఈ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ కోటి రూపాయలను డైరెక్టర్ సినిమా సక్సెస్ మీట్ లో ఇస్తానని చెప్పడంతో అసలు ఈ సినిమా హిట్ అవుతుందా? అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారికి సైతం కౌంటర్ ఇస్తూ డైరెక్టర్ కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పారు. సస్పెన్స్ ను కనిపెట్టిన వారికి కచ్చితంగా డబ్బులు కూడా ఇస్తానని తెలిపారు. దీంతో ఆ కోటి రూపాయలు ఎవరు గెలుచుకుంటారా? అనే ఆసక్తి కూడా నెలకొంది.