టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ అంటే ముందుగా గుర్తొచ్చేది బోయపాటి శ్రీను. తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇతర ఇండస్ట్రీలలోనూ బోయపాటి కంటే హీరోను మాస్ యాంగిల్ లో ఎవరూ చూపించలేరు అన్నట్టుగా ఈ డైరెక్టర్ పేరు సంపాదించుకున్నారు. బోయపాటి సినిమాలు అంటే పవర్ఫుల్ డైలాగులు పదునైన కత్తులు.. చేజింగ్ లు, ఫైటింగ్ లతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు, గుర్తుండిపోయే కథలు కనిపిస్తూ ఉంటాయి. టాలీవుడ్ లో ఎక్కువగా హిట్ పర్సంటేజ్ ఉన్న దర్శకులలో బోయపాటి కూడా ముందు వరుసలో ఉంటాడు. ఈయన సినిమాలకు తెలుగులో కంటే బాలీవుడ్లో క్రేజ్ మరింత ఎక్కువగానే ఉంటుంది. బోయపాటి సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులు యూట్యూబ్ లో వెతికి మరి చూస్తుంటారు. దీంతో ఆ సినిమాలకు మిలియన్ల కొద్ది వ్యూవ్స్ వస్తూ ఉంటాయి. అయితే అలాంటి దర్శకుడు ఇప్పటివరకు మొత్తం 11 సినిమాలు తెరకెక్కించారు. అందులో ఎన్ని హిట్ అయ్యాయి? ఎన్ని ఫ్లాప్ అయ్యాయి అనేది ఇప్పుడు చూద్దాం…

1)భద్ర

మొట్టమొదటగా బోయపాటి శ్రీను రవితేజ హీరోగా భద్ర అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో పాటు మాస్ ఓరియెంటెడ్ సన్నివేశాలు ఉంటాయి. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ సినిమా మాస్ ప్రేక్షకుల కంటే, ప్రేమ కథా చిత్రాలను ఇష్టపడే వారికి ఎక్కువగా దగ్గరైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

2)తులసి

భద్ర తర్వాత బోయపాటి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తులసి సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సైతం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

3) సింహ

రెండు సినిమాల తర్వాత బోయపాటికి అసలైన మాస్ సినిమా తీసి అవకాశం దక్కింది. అదే సింహ… తన అభిమాన హీరో బాలకృష్ణతో బోయపాటి ఈ సినిమాను తీశారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హీట్ గా నిలిచింది.

4) దమ్ము

బాబాయ్ తో సింహా తీసిన తర్వాత బోయపాటి శ్రీను అబ్బాయితో దమ్ము సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ కొన్ని కారణాలవల్ల ఆ అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. ఈ చిత్రం బిలో యావరేజ్ గా నిలిచింది .

5)లెజెండ్

దమ్ము సినిమా తర్వాత మళ్లీ బాలకృష్ణతో లెజెండ్ అనే సినిమాను బోయపాటి తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. మాస్ ప్రేక్షకులకు ఇది మసాలా బిర్యానీగా నిలిచిపోయింది.

6) సరైనోడు

లెజెండ్ సినిమా తర్వాత బోయపాటి మెగా ఫోన్ అందుకున్నారు .అల్లు అర్జున్ హీరోగా సరైనోడు సినిమాను తెరకెక్కించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

7)జయ జానకి నాయక

సరైనోడు సినిమా తర్వాత బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయక అనే సినిమాను తీశాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆశించిన మేర రిజల్ట్ రాలేదు.

8) వినయ విధేయ రామ

బోయపాటి శ్రీను రామ్ చరణ్ కాంబినేషన్ లో వినయ విధేయ రామ అనే సినిమాను తీశాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది .

9)అఖండ

వరుసగా రెండు ఫ్లాప్ సినిమాల తర్వాత బోయపాటి మరోసారి బాలకృష్ణతో అఖండ సినిమాను తీశారు. ఈ సినిమాతో బోయపాటి బాలయ్య కాంబినేషన్లో మరో బ్లాక్ బస్టర్ పడింది.

10) స్కంద

అఖండ సినిమా తర్వాత రామ్ పోతినేని హీరోగా బోయపాటి స్కంద అనే సినిమా తీశాడు. ఈ చిత్రం మాస్ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా సైతం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచి ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

11) అఖండ 2

స్కంద తర్వాత మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా అఖండ పార్ట్ 2 సినిమాను తీశారు. అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తీశారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

సినిమాల్లో ఎన్ని హిట్స్ ఎన్ని ఫ్లాప్స్

ఇలా ఇప్పటివరకు బోయపాటి శ్రీను తన సినిమా కెరియర్లో మొత్తం 11 సినిమాలు తీయగా అందులో ఆరు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఒక సినిమా యావరేజ్ గా నిలిచింది. మరో నాలుగు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.