డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తే మరికొన్ని భారీ అపజయాలను కూడా అందుకున్నాయి. ఇక పూరి జగన్నాథ్ కెరీర్లో ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలు ఏవి? అందులో ఏ సినిమా ఇలాంటి విజయాన్ని అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

1. బద్రి: పవన్ కళ్యాణ్ హీరోగా, అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

2. బాచి: జగపతి బాబు హీరోగా, నీలాంబరి, అనిత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

3. యువరాజా: శివరాజ్‌కుమార్ హీరోగా, లీసా రే, భూమిక చావ్లా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిట్‌గా నిలిచింది.

4. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం: రవితేజ హీరోగా, తనుశ్రీ దత్తా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

5. అప్పు: పునీత్ రాజ్‌కుమార్ హీరోగా, రక్షిత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

6. ఇడియట్: రవితేజ హీరోగా, రక్షిత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది.

7. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి: రవితేజ హీరోగా, అసిన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

8. శివమణి: నాగార్జున హీరోగా, అసిన్, రక్షిత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.

9. ఆంధ్రావాలా: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, రక్షిత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

10. శర్త్: ది ఛాలెంజ్: సచిన్ జోషి హీరోగా, రియా సేన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

11. 143: నందా హీరోగా, అనిత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కంటే తక్కువ ఫలితాన్ని అందుకుంది.

12. సూపర్: అక్కినేని నాగార్జున హీరోగా, అనుష్క శెట్టి, ఆయేషా టకియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కంటే తక్కువ ఫలితాన్ని సాధించింది.

13. పోకిరి: మహేష్ బాబు హీరోగా, ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

14. దేశముదురు: అల్లు అర్జున్ హీరోగా, హన్సిక మోత్వాని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది.

15. చిరుత: రామ్ చరణ్ హీరోగా, నేహా శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

16. బుజ్జిగాడు: ప్రభాస్ హీరోగా, త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.

17. నేనింతే: రవితేజ హీరోగా, సియా గౌతమ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.

18. ఏక్ నిరంజన్: ప్రభాస్ హీరోగా, కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

19. గోలీమార్: గోపీచంద్ హీరోగా, ప్రియమణి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.

20. నేను నా రాక్షసి: రానా దగ్గుబాటి హీరోగా, ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

21. బుద్ధా హోగా తేరా బాప్: అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హేమ మాలిని, రవీనా టాండన్, మినిషా లాంబా తదితరులు నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

22. బిజినెస్‌మ్యాన్: మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

23. దేవుడు చేసిన మనుషులు: రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

24. కెమెరామెన్ గంగతో రాంబాబు: పవన్ కళ్యాణ్ హీరోగా, తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కంటే తక్కువ ఫలితాన్ని సాధించింది.

25. ఇద్దరమ్మాయిలతో: అల్లు అర్జున్ హీరోగా, అమలా పాల్, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కంటే ఎక్కువ ఫలితాన్ని సాధించింది.

26. హార్ట్ అటాక్: నితిన్ హీరోగా, అదా శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.

27. టెంపర్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.

28. జ్యోతిలక్ష్మి: సత్యదేవ్ హీరోగా, ఛార్మి కౌర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

29. లోఫర్: వరుణ్ తేజ్ హీరోగా, దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

30. ఇజం: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా, అదితి ఆర్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

31. రోగ్: ఇషాన్ హీరోగా, మన్నారా చోప్రా, ఏంజెలా క్రిస్లింజ్కీ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

32. పైసా వసూల్: నందమూరి బాలకృష్ణ హీరోగా, శ్రియ శరణ్, ముస్కాన్ సేథీ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

33. మెహబూబా: ఆకాష్ పూరి హీరోగా, నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

34. ఇస్మార్ట్ శంకర్: రామ్ పోతినేని హీరోగా, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది.

35. లైగర్: విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

36. డబుల్ ఇస్మార్ట్: రామ్ పోతినేని హీరోగా, కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది చూడాలి.