హీరోల స్టామినా ఏంటో బాక్సాఫీస్ వద్ద పోటీపడినప్పుడే తెలుస్తుంది. ఏ హీరో ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టాడు. ఫస్ట్ డే ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. అనేదే హీరో అసలు స్టామినాను చూపిస్తుంది. దీనికోసం స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతుంటారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు మాత్రమే కాకుండా ఒకప్పటి హీరోల నుండి ఈ ఆచారం ఇలానే కొనసాగుతోంది. అయితే ఒకప్పుడు టాలీవుడ్ లోని హీరోల మధ్యన మాత్రమే పోటీ ఉండేది. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్లాన్ ఇండియా అయిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా మారిపోయింది. దీంతో హీరోల మధ్య పాన్ ఇండియా వ్యాప్తంగా పోటీ నెలకొంది. దీంతో స్టార్ హీరోలు బరిలో దిగితే ఇతర ఇండస్ట్రీల హీరోలతోనూ పోటీ ఉంటుంది..

ప్రభాస్ రబ్ బీర్ కపూర్ మధ్య పోటీ

ఈ క్రమంలోనే ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ రన్ బీర్ కపూర్ తో పోటీ పడటం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ హీరోగా ప్రస్తుతం స్పిరిట్ అనే సినిమా చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్ తెలుగులో అర్జున్ రెడ్డి అనే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టగా ఆ తర్వాత బాలీవుడ్లో అదే సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ వెంటనే రన్ బీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రభాస్ స్పిరిట్ వాయిదా

ఇక ఇప్పుడు మూడో సినిమాగా ప్రభాస్ తో స్పిరిట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై సైతం భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాను 2027 అక్టోబర్ 29 విడుదల చేస్తున్నట్టు డైరెక్టర్ ప్రకటించారు. నిజానికి మొదట ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చి 5 అనుకున్నారు. తాజాగా దానిని వాయిదా వేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. మరోవైపు రన్ బీర్ కపూర్ ప్రస్తుతం రామాయణ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పార్ట్ వన్ ఈ ఏడాది నవంబర్లో విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పార్ట్ 2 విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ సినిమా పార్ట్ 2 సైతం 2027 దీపావళి సందర్భంగా అక్టోబర్ 28న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అంటే ప్రభాస్ స్పిరిట్ సినిమాకు రామాయణ్ పార్ట్ 2 కు ఒక్క రోజు మాత్రమే తేడా ఉంది. దీంతో ఈ ఇద్దరు హీరోలు పోటీ పడనున్నారు.

2023లోనూ బాలీవుడ్ స్టార్ తో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ఫైట్

ఇక 2023లో ప్రభాస్ ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో బాక్సాఫీస్ ఫైట్ కు దిగారు. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా డిసెంబర్ 21న విడుదల కాగా షారుక్ ఖాన్ నటించిన డుంకి సినిమా డిసెంబర్ 22న విడుదలైంది. ఈ పోటీలో ఓవర్సీస్ లో షారుక్ ఖాన్ తో ప్రభాస్ ఓడిపోయాడు. కానీ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లలో ప్రభాస్ టాప్ లో ఉన్నాడు. ప్రభాస్ కు బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు రామాయణ్ సినిమా కంటే ప్రభాస్ స్పిరిట్ ఎక్కువ వసూలు చేస్తే ఇండియాకే ప్రభాస్ బాద్ షాగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే కాకుండా ఈ ఫైట్ తో టాలీవుడ్ , బాలీవుడ్ ఎవరి సత్తా ఏంటో తేలుతుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి ప్రభాస్ స్పిరిట్ సినిమాతో బాలీవుడ్ హీరోను వెనక్కి నెట్టేస్తాడా…. టాలీవుడ్ ను ఓ రేంజ్ లో నిలబెడతాడా అనేది చూడాలి.