ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే అంత సులువు కాదు. స్టూడియోల చుట్టూ ఏళ్లపాటు తిరగాల్సి ఉంటుంది. నటుడిగా ఏ చిన్న పాత్ర రావాలన్నా.. దర్శకుడిగా అవకాశం దక్కాలన్నా చెప్పులు అరిగేలా దర్శకులు, నిర్మాతల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అంత తిరిగిన తర్వాత కూడా అవకాశాలు వస్తాయా అంటే గ్యారెంటీ లేదు.

కొన్నిసార్లు జీవితాలే నాశనం అయిపోవచ్చు. అయితే కొందరు మాత్రం తెలివిగా ఎంత టాలెంట్ ఉన్నా ముందుగా కిందిస్థాయి నుండి పైకి రావాలని అనుకుంటారు. దానికోసం టీవీ షోలు, సీరియల్స్, ఇతర బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. అలాంటివారికి అవకాశం ఇవ్వడం కూడా గొప్ప విషయమే. అయితే అలాంటి ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన టీవీ షో జబర్దస్త్.

చాలామందికి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్

జబర్దస్త్ టీవీ షో చాలామందికి డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా అనసూయ యాంకర్ గా పరిచయం అవ్వగా ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు ఇదే టీవీ షో ద్వారా యాంకర్ రష్మి సైతం ప్రేక్షకులకు పరిచయమైంది. అంతకుముందే రష్మీ సినిమాలు చేసినప్పటికీ జబర్దస్త్ ద్వారా ఆమెకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ షో తర్వా సినిమాలతో పాటు మరిన్ని టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

నటులుగా దర్శకులుగా అవకాశాలు

ఇక కంటెస్టెంట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ లో కామెడీ పండించిన చాలామంది ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళు ఆ తర్వాత సినిమాలలో నటించారు. అంతేకాకుండా ఇదే షో ద్వారా పరిచయమై ఓవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు సినిమాలకు దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగారు. జబర్దస్త్ ద్వారా పరిచయమైన హైపర్ ఆది ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. చిన్న హీరో నుండి పెద్ద హీరోల వరకు సినిమాలలో ఛాన్సులు కొట్టేస్తున్నాడు. ఈటీవీ షో ద్వారా పరిచయమైన చమ్మక్ చంద్ర సైతం సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాలతో పాటు చంద్ర టీవీ షో లలో కనిపిస్తున్నాడు.

మొన్న బలగం వేణు ఇప్పుడు డేగల బాబు

ఇక ఇటీవలి కాలంలో ఈ షో నుండి వచ్చిన ఇద్దరు దర్శకులుగా సైతం మంచి విజయాలను అందుకున్నారు. వారిలో ఒకరు బలగం వేణు. బలగం సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన వేణు ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వేణు తీసిన బలగం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణలో ఈ సినిమాను గ్రామాల్లో ప్రొజెక్టర్ లలో వేసి మరి చూశారు. ప్రస్తుతం వేణు ఎల్లమ్మ అనే మరో సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ను కొట్టేశాడు. ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తుండగా హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ నటిస్తున్నాడు. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు మరో జబర్దస్త్ కంటెస్టెంట్ పేరు హాట్ టాపిక్ గా మారింది అతడే జబర్దస్త్ బాబు అలియాస్ (డేగల బాబు). ఈ కామెడీ షో లో కేవలం ఒక కంటెస్టెంట్ గా కనిపించిన బాబు ఎందరో అభిమానులను సంపాదించు. షోలో కంటెస్టెంట్ గా కనిపించడంతోపాటు స్క్రిప్ రైటర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఎవరూ ఊహించని విధంగా బాబు ఇటీవల లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. ఈటీవీ విన్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ సిరీస్ లో హర్ష కీలకపాత్రలో నటించగా… హైపర్ ఆది సైతం ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ సిరీస్ మంచి విజయం సాధించడంతో బాబు సినిమాల్లోనూ అవకాశం వచ్చినా సక్సెస్ అవుతాడని ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఒక జబర్దస్త్ లాంటి టీవీ షో ద్వారా ఇంత మందికి ఇండస్ట్రీలో లైఫ్ రావడం అంటే గొప్ప విషయం అనే చెప్పాలి.