విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రణబాలి. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనే స్థాయి ప్రభావం చూపుతుంది. విడుదలకు ముందు ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉండగా, విడుదల తర్వా వచ్చిన డివైడ్ టాక్ కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఎలా సాగుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో నెలకొంది.

డివైడ్ టాక్‌తో ఓపెనింగ్స్‌పై ప్రభావం!

విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, రష్మిక మందన్నతో ఆయనకున్న స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వసూళ్ల విషయంలో ఈ మూవీకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లను సాధించాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తొలి రోజుల్లో వచ్చే కలెక్షన్లు సినిమా విజయావకాశాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

రణబాలి సినిమాకు సంబంధించిన రెండు రోజుల బాక్సాఫీస్ వసూళ్ల వివరాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ.10.41 కోట్ల షేర్.. సుమారు రూ.18.05 గ్రాస్ కోట్లుగా ఉంది. ఇందులో నైజాం ప్రాంతం నుంచి రూ.5.71 కోట్ల షేర్, సీడెడ్ నుంచి రూ.1.19 కోట్ల షేర్, ఆంధ్ర ప్రాంతం నుంచి రూ.3.51 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక కర్ణాటక, మిగిలిన భారతదేశ ప్రాంతాలు, డబ్బింగ్ మార్కెట్లను కలిపి సుమారు రూ.1.40 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఓవర్సీస్ మార్కెట్ నుంచి సుమారు రూ.3.05 కోట్ల షేర్ నమోదైనట్లు అంచనా. ఈ లెక్కలన్నింటినీ కలిపితే రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.14.86 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. గ్రాస్ వసూళ్లు సుమారు రూ.28.85 కోట్లుగా ఉన్నాయి.

ప్రస్తుతం 34 శాతం రికవరీ!

ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు సుమారు 34 శాతం రికవరీ సాధించింది. అంటే సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే పెట్టుబడిలో కొంత భాగాన్ని వెనక్కి తీసుకురాగలిగింది. అయితే హిట్ స్టేటస్‌ను అందుకోవడానికి ఇంకా గణనీయమైన వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత కలెక్షన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనే విషయాన్ని తేల్చలేం.

హిట్ కావాలంటే ఏం జరగాలి?

రణబాలి సినిమా విజయాన్ని నిర్ణయించడంలో రాబోయే రోజుల్లో వచ్చే వసూళ్లు అత్యంత కీలకం కానున్నాయి. ముఖ్యంగా వారాంతపు కలెక్షన్లు పెరగడంతో పాటు, వారం రోజుల పాటు థియేటర్లలో ప్రేక్షకులను నిలబెట్టుకోగలిగితే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే నెగిటివ్ టాక్ కొనసాగితే వసూళ్లు తగ్గే ప్రమాదం కూడా ఉంది. మొత్తంగా చూస్తే.. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.14.86 కోట్ల షేర్ సాధించిన రణబాలి సినిమా ప్రస్తుతం సుమారు 34 శాతం రికవరీతో కొనసాగుతోంది.

ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు!

ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ చిత్రం 43 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇప్పటికీ ఈ చిత్రం 14.86 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. దాంతో ఈ సినిమా మరో 28.14 కోట్ల షేర్ కలెక్షన్లను వరల్డ్ వైడ్ గా రాబడితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. మరి ఈ మూవీ టోటల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందనేది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది.

సరైన హిట్ కోసం విజయ్ మరికొన్నాళ్లు ఆగాల్సిందేనా?

గత కొన్నలుగా విజయ్ దేవరకొండ వరుస అపజాయాలతో డీలా పడిపోయి ఉన్నాడు. ప్రస్తుతం రణబాలికి వస్తున్న కలెక్షన్లను చూస్తే ఈ మూవీ కూడా ఆయనకు భారీ విజయాన్ని అందించే సూచనలు కనిపించడం లేదని, దాంతో ఈ నటుడు సరైన కం బ్యాక్ కోసం మరికొంత కాలం వెయిట్ చేయాల్సిన అవసరం చాలావరకు ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.