టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు శ్రీవిష్ణు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా కంటెంట్‌కు ప్రాధాన్యత ఉన్న సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఒకవైపు వినోదాత్మక చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు వైవిధ్యమైన కథాంశాలతో కూడిన సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన కెరీర్‌లో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకోగా, మరికొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆయన సినిమాల హిట్, ఫ్లాప్ జాబితా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ప్రేమ ఇష్క్ కాదల్

శ్రీవిష్ణు నటించిన ఈ చిత్రం ఆయన కెరీర్‌లో గుర్తింపు తెచ్చుకున్న సినిమాల్లో ఒకటి. ప్రేమకథకు వినోదాన్ని జోడించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం హిట్‌గా నిలిచింది.

2. సెకండ్ హ్యాండ్

శ్రీవిష్ణు కెరీర్‌లో వచ్చిన మరో చిత్రం సెకండ్ హ్యాండ్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

3. అప్పట్లో ఒకడుండేవాడు

విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం శ్రీవిష్ణు కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

4. మా అబ్బాయి

శ్రీవిష్ణు నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది.

5. ఉన్నది ఒక్కటే జిందగీ

రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు కూడా కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

6. మెంటల్ మదిలో

విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్‌గా నిలిచింది.

7. నీది నాది ఒకే కథ

వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం శ్రీవిష్ణు నటనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమా హిట్‌గా నిలిచింది.

8. వీర భోగ వసంత రాయలు

శ్రీ విష్ణు నటించిన ఈ చిత్రం విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

9. బ్రోచేవారెవరురా

శ్రీ విష్ణు కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రాల్లో బ్రోచేవారెవరురా ఒకటి. వినోదం, ఆసక్తికరమైన కథనం కలగలిసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే విజయాల్లో ఈ చిత్రం కూడా ఒకటిగా నిలిచింది.

10. తిప్పరా మీసం

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.

11. గాలి సంపత్

కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

12. రాజ రాజ చోర

శ్రీవిష్ణు నటన, వినోదం కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుంది. ఆయన కెరీర్‌లో విజయవంతమైన సినిమాల జాబితాలో రాజ రాజ చోర కూడా ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది.

13. అర్జున ఫల్గుణ

ఈ చిత్రం శ్రీవిష్ణు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

14. భళా తందనాన

శ్రీవిష్ణు నటించిన మరో చిత్రం భళా తందనాన. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

15. అల్లూరి

శ్రీ విష్ణు పోలీస్ అధికారిగా కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది.

16. సామజవరగమన

శ్రీవిష్ణు కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో సామజవరగమన ఒకటి. వినోదానికి ప్రాధాన్యతనిస్తూ రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అయ్యింది.

17. ఓం భీమ్ బుష్

శ్రీవిష్ణు నటించిన చిత్రం హిట్‌గా నిలిచింది.

18. స్వాగ్

విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు ప్రత్యేకమైన పాత్రలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

19. సింగిల్

శ్రీవిష్ణు నటించిన ఈ చిత్రం ఆయన విజయాల జాబితాలో మరో ముఖ్యమైన సినిమాగా నిలిచింది. వినోదాత్మక కథాంశంతో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకుల ఆదరణను అందుకుంది.

20. విష్ణు విన్యాసం

శ్రీవిష్ణు నటించిన ఈ చిత్రం పర్వాలేదనే స్థాయి విజయాన్ని అందుకుంది.

21. మృత్యుంజయ్

శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది.

22. కామ్రేడ్ కళ్యాణ్

కొంతకాలం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

త్వరలో ఫ్యామిలీపాక్‌తో ప్రేక్షకుల ముందుకు!

ఇలా శ్రీవిష్ణు కెరీర్‌లో విజయాలు, అపజయాలు రెండూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఫ్యాక్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమా శ్రీ విష్ణుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.