సినిమా ఇండస్ట్రీ లోకి హీరోల వారసులు వస్తున్నారంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరో ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వేయి కళ్ళతో వేచి చూస్తారు. ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు హిట్ కొడతాడా అని ఆసక్తిగా వెయిట్ చేస్తారు. ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా అలానే ఎదురుచూస్తున్నారు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమైన సంగతి తెలిసిందే. చాలామంది హీరోలకు కుమారులు పాతకెళ్ళు రాకముందే సినిమాల్లోకి అడుగుపెట్టగా …బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం ఆలస్యమైందనే చెప్పాలి. ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎంట్రీ పై సస్పెన్స్ వీడితో ఆయన సినిమాల్లోకి వస్తున్నారని క్లారిటీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.
బింబిసార దర్శకుడితో సినిమా
మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాను “బింబిసార” సినిమా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు డేట్ ఫిక్స్ అయినప్పటికీ సినిమా మాత్రం సెక్స్ పైకి రాలేదు. దానికి కారణం మొన్నటి వరకు దర్శకులు మారడం అనే తెలుస్తోంది. అయితే ఇప్పుడు హీరోయిన్ల ఎంపిక విషయంలో ఆలస్యం కారణంగా సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఆటంకిగా మారినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్లుగా రాణిస్తున్న భామలతో పాటు కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోయే హీరోయిన్ లను సైతం పరిశీలిస్తున్నట్టు టాలీవుడ్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
హీరో శ్రీకాంత్ కుమార్తె పేరు వినిపించినా
ఈ క్రమంలో సీనియర్ హీరో శ్రీకాంత్ కుమార్తె మేధా పేరు కూడా వినిపిస్తుంది. శ్రీకాంత్ తన కుమార్తెను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. దీంతో మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్ గా మేధాను తీసుకుంటే బాగుంటుంది అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే మేధా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న “మైత్రి ఇన్ లవ్” అనే సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మళ్లీ మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభమైంది.
రేసులో కుర్ర బ్యూటీ రాషా తడానీ
మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు క్రేజ్ రావాలంటే ఒక స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయాలని చాలా కాలం నుండి మేకర్స్ భావిస్తున్నారు. అయితే మధ్యలో హీరోయిన్ రాషా తడానీ కూడా రేసులోకి వచ్చింది. రాషాను మోక్షజ్ఞ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం చేయాలని భావించినట్టు సమాచారం. కానీ ఈ సినిమా ఆలస్యం అవ్వడంతో ఆ బ్యూటీ శ్రీనివాస కళ్యాణం సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాతో ప్రేక్షకులు పరిచయమైంది. ఈ సినిమా విజయం సాధించలేదు కానీ బ్యూటీ అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు రాష బిజీ అవ్వడంతో ఛాన్స్ లేకుండా పోయింది.
మళ్లీ తెరపైకి శ్రీలీల పేరు
ఇప్పుడు మోక్షజ్ఞ కోసం మళ్లీ శ్రీలీల పేరే వినిపించడం ఆసక్తికరంగా మారింది. చాలాకాలంగా మోక్షజ్ఞకు జోడిగా శ్రీలీల నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈ వార్తలు చక్కర్లు కొట్టి ఏళ్లు గడుస్తోంది. కానీ సినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు శ్రీలీల కూడా సరైన హిట్ కోసం ఆరాటపడుతోంది. ఈ క్రమంలో మోక్షజ్ఞతో నటించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇద్దరి జోడీ కుదిరితే మోక్షజ్ఞ పక్కన హీరోయిన్ గా శ్రీలీల నటించే అవకాశం ఉన్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు శ్రీ లీల తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఈ బ్యూటీ కి ఇప్పటికే లక్షల్లో అభిమానులు ఉన్నారు. శ్రీ లీల అందం అభినయంతో పాటు నటనలోనూ మెప్పిస్తుంది. అంతేకాకుండా చూడ్డానికి అచ్చం తెలుగమ్మాయిలానే కనిపిస్తుంది. కాబట్టి మోక్షజ్ఞ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తే సినిమాకు ఇతర ఇతర భాషల్లోనూ క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. మరి చివరికి మోక్షజ్ఞతో ఎవరు జోడి కడతారా? అన్నది చూడాలి.



