ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీజేపీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. జడ్జి కొందరు యువతను విమర్శిస్తూ చేసిన కాక్రోచ్ అనే వ్యాఖ్యలతో పుట్టిన సీజేపీ మొదట సోసష్ మీడియా పేజీగానే మొదలైనప్పటికీ ప్రస్తుతం మాత్రం ఒక ఉద్యమంలా మారింది. ముఖ్యంగా నీట్ పేపేర్ లీకేజీపై సీజేపీ చేపట్టిన నిరసనలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వెళ్లాయి. మొదట బీజేపీ తగ్గనప్పటికీ ఆ తరవాత దేశవ్యాప్తంగా ఉద్యమం తీవ్రస్థాయికి చేరడంతో తప్పక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే అంతా మొదట సీజేపీ ఓ రాజకీయ పార్టీగా ఎదుగుతుందని, దేశరాజకీయాల్లో పాల్గొంటుందని భావించారు. కానీ అలా జరగకుండా తాము ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించింది.
ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించిన సీజేపీ
అసలు ఎన్నికల జోలికి వెళ్లబోమని, తాము కేవలం అసవరం వచ్చినప్పుడు సమస్యలపై మాత్రమే పోరాటం చేస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఇక నీట్ ఉద్యమం తరవాత సీజేపీ స్కూళ్లలో మౌలిక వసతులపై పోరాటం చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ స్కూళ్ల పరిశుభ్రత, అభివృద్ధి కోసం పోరాడతామని ప్రకటించింది. అభిజిత్ దీప్కే తన స్వగ్రామం నుండి ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అయితే ఇంతలో ఎన్నికల కమిషన్ లో ఓట్ చోరీ ఆరోపణలు వచ్చాయి. అర్హులైన వారి ఓట్లను కూడా తొలగిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ సర్ ప్రక్రియ ద్వారా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని విమర్శలు వచ్చాయి. అయితే నిజానికి ఈ విమర్శలు మొదట చేసింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. దీనిపై రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని సుప్రీంకోర్టు వద్ద ఆందోళనలకు సైతం పిలుపునిచ్చి దేశం మొత్తాన్ని తనవైపు తిపుకున్నారు.
రాహుల్ ప్రొటెస్ట్ కంటే సీజేపీ ప్రొటెస్ట్ కే ఎక్కువ క్రేజ్
అయితే కాంగ్రెస్ నిరసనలు వార్తల్లో హాట్ టాపిక్ గా మారినా ఆ తరవాత వచ్చిన కాక్రోచ్ ల ఎంట్రీతో అందరి దృష్టి వారిపైనే పడింది. నేహాబోరా, అభిజిత్ దీప్కే కలిసి ఆందోళన చేపట్టడంతో వారికే ఎక్కువ మద్దతు లభించింది. ఇంతలో కేంద్ర ప్రభుత్వం జంతర్ మంతర్ వద్ద నిరసనలపై ఆంక్షలు విధించింది. అక్కడ నిరసనలు తెలిపే హక్కు లేదని స్పష్టం చేసింది. అభిజిత్ దీప్కే సహా ఇతర నిరసనకారులను అదుపులోకి తీసుకుంది. అయినప్పటికీ సీజేపీ వెనక్కి తగ్గలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయంలో గట్టిగా ఉంది. ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేయడం, ఆందోళనకారులపై నిఘా పెట్టడం, వారిని అదుపులోకి తీసుకోవడంతో వారికి నిరసన తెలిపేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ప్రస్తుతం సీజేపీ నిరసనలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్పటికీ వారిని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడంతో ఛాన్స్ లేకుండా పోయింది.
కాంగ్రెస్ కంటే కాక్రోచ్ జనతాపార్టీకే బీజేపీ భయపడుతోందంటూ ప్రచారం
ఇక ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కంటే సీజేపీకే బీజేపీ భయపడుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానికి కారణంగా దసరా పండుగ సందర్భంగా బీజేపీ నాయకులు కొందరు సీజేపీ పార్టీ సింబర్ అయిన కాక్రోచ్ లను దహనం చేయడమే. సాధారంగా దసరాకు రావణుడిని దహనం చేస్తుంటారు. కానీ కొందరు బీజేపీ నాయకులు కాక్రోచ్ ల భారీ నిర్మాణాలు ఏర్పాటు చేసి వాటిని దహనం చేశారు. ఇలా చేసినవారిలో బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ కంటే సీజేపీకే ఎక్కువ బయపడుతోందని, ఆ పార్టీనే తమ శత్రువుగా భావిస్తోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. దానికి కారణంగా సీజేపీ బీజేపీ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడంలో సక్సెస్ అవ్వడమేనని అంటున్నారు. ఎవరికి బయపడితే వారిని టార్గెట్ చేస్తారని, బీజేపీ ఇంకా సీజేపీకి బయపడుతుంది కాబట్టే ఆ పార్టీ సింబల్ ను దహనం చేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో సీజేపీ మరింత బలం తెచ్చుకుని పోరాడుతుందా.. లేదంటే వెనక్కి తగ్గుతుందా అనేది చూడాలి మరి..



