సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లకు తెలుగు సినిమాల గురించి విమర్శలు చేయడం అలవాటుగా మారిపోయింది. మొదట అవకాశాల కోసం ఇండస్ట్రీకి వచ్చి, ఆ తర్వాత బాలీవుడ్ లో ఛాన్సులు రాగానే తెలుగు సినిమాలపై విమర్శలు కురిపిస్తున్నారు. ఆ హీరో పక్కన నటించకుండా ఉండాల్సింది, హీరో ఏజ్ ఎక్కువ, తెలుగులో ఎక్స్పోజింగ్ ఎక్కువ… అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకరు ఇద్దరు అనే కాకుండా చాలామంది హీరోయిన్ల తీరు ఇదే విధంగా ఉంది. తెలుగులో తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అనే ఒక సామెత ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరోయిన్ల తీరు కూడా అదే విధంగా మారిపోయింది.
ఇటీవల జాహ్నవి కపూర్ పెద్ది పై కామెంట్స్
ఇటీవలే జాహ్నవి కపూర్ తెలుగులో నటించిన పెద్ది సినిమాపై షాకింగ్ కామెంట్లు చేసింది. తను ఆ సినిమా షూటింగ్ విషయంలో ఇబ్బంది పడినట్టు తెలిపింది. ఆ సీన్లు చేసేటప్పుడే తను గట్టిగా వాదించాల్సిందని వ్యాఖ్యానించింది. సినిమా విడుదలైన తర్వాత జరిగిన అవమానాలకు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అంటూ వ్యాఖ్యానించింది. ఫ్యూచర్ లో అలాంటి తప్పులు చేయనని, ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని వెల్లడించింది.
మరోసారి రాధికా ఆప్టే టాలీవుడ్ పై విమర్శలు
ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే తెలుగు సినిమాలపై మరోసారి షాకింగ్ కామెంట్ లు చేసింది. గతంలో తనను సౌత్ లో ఓ సీనియర్ హీరో ఇబ్బంది పెట్టాడని రాధిక ఆప్టే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తను నటించిన “అక్క” వెబ్ సిరీస్ ప్రమోషన్ లలో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాధిక ఆప్టే టాలీవుడ్ లో బాలకృష్ణ పక్కన లెజెండ్, లయన్ అనే సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అయితే లెజెండ్ సినిమా గురించి పరోక్షంగా మాట్లాడుతూ తాను తెలుగులో చేసిన ఓ సినిమాలో తనకంటే వయసులో చాలా పెద్దవాడైన హీరోతో రొమాన్స్ చేయవలసి వచ్చింది అని చెప్పింది. కథలో భాగంగా సొంతమామనే పెళ్లి చేసుకునే సన్నివేశాలు ఆ సినిమాలో ఉన్నాయని చెప్పింది. పైగా ఆ సినిమా మధ్యలోనే తన పాత్రను చంపేశారని… నవ్వుతూ ట్రోల్ చేసింది. నేరుగా సినిమా పేరు చెప్పనప్పటికీ రాధిక ఆప్టే తెలిపిన వివరాల ప్రకారం ఆ సినిమా లెజెండ్ సినిమాగా ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది. నిజానికి ముంబైకి చెందిన రాధిక ఆప్టే తన కెరీర్ ప్రారంభంలో టాలీవుడ్ లో లెజెండ్, లయన్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి పరిమితం అయిపోయింది.
గతంలోనూ అలాంటి విమర్శలు
ఈ క్రమంలో సౌత్ లో హీరోల డామినేషన్ గురించి రాధిక ఆప్టే పలు సందర్భాలలో చెబుతూ వచ్చింది. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్లు అలా ఉండాలి… ఇలా ఉండాలి అంటూ కామెంట్లు చేసింది. కానీ బాలీవుడ్ వెబ్ సిరీస్ లు, సినిమాలలో రాధిక ఆప్టే చేసిన సన్నివేశాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అయినప్పటికీ ఈ బ్యూటీ తెలుగు సినిమాలపై హీరోలపై కామెంట్లు చేయడంతో విమర్శలను ఎదుర్కొంటోంది. లెజెండ్ సినిమాలో నటించడం కంటే ముందు కూడా రాధికా ఆప్టేకు తాను నటించాల్సింది సీనియర్ హీరో పక్కన అని తెలుసు. అయినప్పటికీ అప్పుడు అవకాశాల కోసం నటించి ఇప్పుడు ఆ సినిమాలపైనే ట్రోల్స్ చేయడంతో నెటిజన్లు, అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరో వైపు ఇటీవల కాలంలో హీరోయిన్ల విమర్శలు ఎక్కువ అవ్వడంతో అభిమానులు సౌత్ ఇండస్ట్రీ భామలను, లేదంటే తెలుగు వాళ్ళనే హీరోయిన్ లుగా తీసుకోవాలని నార్త్ భామలను హీరోయిన్లుగా అసలు ఎంపిక చేయవద్దని సైతం కోరుతున్నారు.



