టెక్నాలజీతో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. టెక్నాలజీని మంచి కోసం ఉపయోగిస్తే అది మంచి చేస్తుంది. కానీ చెడు కోసం వాడితే అది చెడే చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఇది మరోసారి నిరూపితం అవుతోంది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయిందో తెలిసిందే. కంటెంట్ రైటింగ్, ఫోటోల ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్, కోడింగ్ ఇలా అనేక రంగాలలో ఏఐ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఫోటోలు వీడియోల ఎడిటింగ్ లో ఏఐనే ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. తమ ఫోటోలను ఎడిట్ చేసుకోవడం, వీడియోలను ఎడిట్ చేసుకోవడం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం లాంటివి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కొంతమంది కేటుగాళ్ళు తప్పుడు దారిలో వినియోగిస్తున్నారు. ఏఐ వాడుతూ సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు ఎడిట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
జాహ్నవి కపూర్ ఏఐ వీడియో వైరల్
ఇటీవల బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలోని ఓ వీడియో సాంగ్ ను ఏఐ ద్వారా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పాటలో జాహ్నవికాపూర్ ను దారుణంగా చూపించారు. జాహ్నవి కపూర్ తో పాటు ఎన్టీఆర్ ని సైతం అసభ్యకరంగా చూపించారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో హీరోయిన్ జాహ్నవి కపూర్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించారు. తర్వాత చాలామంది సెలబ్రిటీలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగి కొద్ది రోజులే అవుతుంది. అయితే ఇంతలో మరికొందరు హీరోయిన్ల ఫోటోలు వీడియోలు సైతం ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అర్జున్ రెడ్డి హీరోయిన్ ఏఐ వీడియో వైరల్
తాజాగా అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండేకు సైతం అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సోషల్ మీడియాలో శాలిని పాండే వీడియోను ఎడిట్ చేసి కేటుగాళ్లు షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో హీరోయిన్ ను అసభ్యకరంగా చూపించారు. వీడియో ఎడిట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని మూవీ లవర్స్ కోరుతున్నారు. కొద్దిరోజుల క్రితం కేజీఎఫ్ సినిమా హీరోయిన్ ఫోటోలను సైతం మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. హీరోయిన్ సాధారణ ఫోటోలను బికినీ ఫోటోలు గా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇలా మార్ఫింగ్ చేసినవాళ్లలో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా మరొకరు సిఏ ఉన్నారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని జైలు శిక్ష విధించారు.. అప్పట్లో హీరోయిన్ సాయి పల్లవికి సైతం ఇలాంటి సమస్యని వచ్చింది. హీరోయిన్ సాయి పల్లవి ఫోటోలను బీచ్ లో బికినీలో ఉన్నట్టుగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు తెగ వైలవడంతో సాయి పల్లవి అవి ఎడిటింగ్ అంటూ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. వీరితో పాటు తమన్నా బాటియా ఫోటోలను కూడా ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి షేర్ చేశారు. తరవాత ఎడిట్ చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అని తమన్నా సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు.
హీరోయిన్ ల పాలిట శాపంగా మారిన ఏఐ
ఇలా ఏఐ హీరోయిన్ల పాలిట శాపంగా మారుతుంది. వీరిద్దరివి మాత్రమే కాకుండా గతంలోనూ కొంతమంది హీరోయిన్ ల ఫోటోలు, వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇండస్ట్రీలో ఆందోళన మొదలైంది. ఏఐ వీడియో కారణంగా సినిమాలో నటించాలంటేనే హీరోయిన్లు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఎవరి వీడియోను క్రియేట్ చేస్తారో అని టెన్షన్ పడుతున్నారు. భవిష్యత్తులో అసలు ఏఐ ద్వారా అసభ్యకర వీడియోలు ఫోటోలు ఎడిట్ చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



