టాలీవుడ్ లోని టాలెంటెడ్ హీరోయిన్ లలో రెజీనా కేసాండ్ర కూడా ఒకరు. 2012లో వచ్చిన ఎస్ఎంఎస్ సినిమాతో రెజీనా టాలీవుడ్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్ల్యూ అవార్డును అందుకుని ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది. రెజీనా నటించిన రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలు సూపర్ హిట్ లుగా నిలిచాయి. ఈ బ్యూటీ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కంటెంట్ ఓరియెంటెడ్, మరియు ప్రయోగాత్మక సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెజీనా ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో సుందర్. పి దర్శకత్వంలో రాబోతున్న మహాశక్తి అనే సినిమాలో నటించింది. ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా రెజీనా ఫుల్ లెన్త్ విలన్ రోల్ లో నటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హీరోలు..హీరోలు ఢీ కొడితే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు బాగా తెలుసు. కానీ ఇద్దరు హీరోయిన్లు స్క్రీన్ పై పోటీ పడటం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి డిఫరెంట్ జోనర్ లోనే రాబోతుంది. కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ప్రారంభించగా రెజీనా చాలా చురుగ్గా పాల్గొంటుంది.
నార్త్ ఇండస్ట్రీపై రెజీనా షాకింగ్ కామెంట్స్
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెజీనా చేసిన కామెంట్ లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. గత కొంతకాలంగా కొంతమంది నార్త్ హీరోయిన్లు సౌత్ సినిమాలపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా ఛాన్స్ ల కోసం సౌత్ లో నటించి బాలీవుడ్ ఆఫర్స్ రాగానే ఇక్కడ సినిమాలపై చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా సినిమా కథలపై, తమకు వచ్చిన పాత్రలపై మరియు సన్నివేశాలపై ఆరోపణలు చేస్తున్నారు.
ఇటీవల తెలుగు ఇండస్ట్రీపై హీరోయిన్ ల కామెంట్స్
ఇటీవలే జాహ్నవి కపూర్ పెద్ది సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగినట్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాలోని సన్నివేశాల పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నిన్నగాక మొన్న ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే మాట్లాడుతూ తను నటించిన తెలుగు సినిమాలోవరసకు మామ అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని.. ఆ సినిమాలో తన పాత్రను మధ్యలోనే చంపేశారని చెప్పారు. రాధిక ఆప్టే అలా తెలుగు సినిమా గురించి వ్యంగ్యంగా మాట్లాడటంతో అటు ఆమెపై ఇటు జాహ్నవి కపూర్ పై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుండి కూడా పలువురు ఈ విషయంపై స్పందిస్తూ హీరోయిన్ల తీరుపై మండిపడుతున్నారు.
నార్త్ హీరోయిన్ లకు రెజీనా స్ట్రాంగ్ కౌంటర్
అయితే తాజాగా అలాంటి వాళ్లకు గట్టి సమాధానం ఇచ్చేలా రెజీనా కామెంట్స్ చేసింది. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ పై సంచలన ఆరోపణలు చేసింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక సినిమా కేసరి చాప్టర్ 2 అన్ jటోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ లో తాను కీలకమైన పాత్రలో నటించినట్టు చెప్పింది. అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్రలో చేసినప్పటికీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల నుండి ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఏ కారణం లేకుండానే ప్రమోషన్స్ నుండి తన పేరును పూర్తిగా తొలగించాలని చెప్పింది.
సౌత్ నుండి వచ్చినందుకే వ్యత్యాసమా?
తనపై, అక్షయ్ కుమార్ పై చిత్రీకరించిన ప్రత్యేక పాటను విడుదల చేసినప్పటికీ సోషల్ మీడియా ప్రచారంలో కూడా తనను ట్యాగ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీన్ని ఏమని భావించాలి? అంటూ ప్రశ్నించింది. తాను సౌత్ హీరోయిన్ కాబట్టే ఈ వ్యత్యాసం చూపించారా? అంటూ ప్రశ్నించింది. ఉత్తరాది నటీనటులు తమ అభిప్రాయాలను బలంగా చెబితే ప్రొఫెషనల్ అంటారు. అదే సౌత్ యాక్టర్స్ ప్రశ్నిస్తే పొగరుబోతులుగా ముద్ర వేస్తారని తెలిపింది. సౌత్ సినిమాలుపై ఉత్తరాది నటినటులు మాట్లాడే తీరు సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం రెజీనా చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో బాలీవుడ్ జనాలకు గట్టిగా బుద్ధి చెప్పింది అంటూ సౌత్ మూవీ లవర్స్ ఆమెను మెచ్చుకుంటున్నారు. మరోవైపు సౌత్ ఇండస్ట్రీపై జాహ్నవి, రాధిక ఆప్టే విమర్శలపై ఇప్పటికే నిర్మాత ఎస్ కేఎన్, హీరోయిన్ పాయల్ రాజ్ పూర్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే.



