టాలీవుడ్లోని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. కేవలం ఒకే రకమైన సినిమాల్లో నటించకుండా డిఫరెంట్ కథలతో, డిఫరెంట్ పాత్రలతో శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. అంతేకాకుండా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా తన పనితాను చేసుకునిపోతాడు. నిజానికి కెరీర్ ప్రారంభంలో శర్వా చిన్న చిన్న రోల్స్ లో నటించాడు. చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో పేషెంట్ పాత్రలో నటించాడు. ఆ తరవాత చాలా సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు చేశాడు. తన కెరీర్ లో గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మళ్లి మళ్ళి ఇదిరానిరోజు లాంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా వెన్నెల లాంటి ప్రేమకథా చిత్రంలో నెగిటివ్ రోల్ చేసి మెప్పించాడు. రన్ రాజా రన్ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో అదరగొట్టాడు. ఇక మళ్లీ మళ్లీ ఇది రానిరోజు లాంటి స్పోర్ట్స్ డ్రామాలో లవర్ బాయ్ గా అథ్లెట్ గా మెప్పించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే శర్వానంద్ దాదాపు అన్ని రకాల పాత్రల్లోనూ నటించాడు. అయితే ఇప్పటి వరకు శర్వా చేయని రోల్ ఒకటి ఉంది. అదే రా అండ్ రస్టిక్ లుక్ లో ఇప్పటి వరకు కనిపించలేదు. ప్రస్థానంలో మాస్ హీరోగా కనిపించినా ఫైట్స్ చేసినా పూర్తిస్థాయి మాస్ రా అండ్ రస్టిక్ పాత్రలో నటించలేదు. అయితే ఇప్పుడు ఆ సరదా కూడా తీరిపోనుంది. శర్వానంద్ ప్రస్తుతం భోగి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ తెలంగాణ గామీణ నేపథ్యంలో తెరకెక్కింది. సినిమా ట్రైలర్ చూస్తే నైన్టీస్ బ్యాక్ డ్రాప్ లో తీసినట్టు కనిపిస్తోంది. చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా డింపుల్ హయాతి సైతం ముఖ్యమైన పాత్రలో నటించింది. చిత్రంలో శర్వానంద్ ఐదుగురు చెల్లెల్లకి అన్నగా నటించాడు. సినిమాను కేకే రాధా మోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సినిమాకు స్వరాలు సమకూర్చారు. నవంబర్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
సంపత్ నంది తీసిన సినిమాలు
సంపత్ నంది మొదట వరుణ్ సందేశ్ హీరోగా ఏమైంది ఈవేళ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరవాత రామ్ చరణ్ హీరోగా రచ్చ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా 32 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఆ తరవాత బెంగాల్ టైగర్, సీటిమార్ లాంటి సినిమాలను తెరకెక్కించాడు. ఈ సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగానూ పలు సినిమాలకు పనిచేశాడు. ఇక భోగి సినిమా కోసం ఏకంగా 3 సంవత్సరాలు కేటాయించినట్టు సంపత్ నంది చెబుతున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
భోగి ట్రైలర్ ఎలా ఉందంటే?
శర్వానంద్ గతంలో ఎప్పుడూ ఇలాంటి రా అండ్ రస్టిక్ రోల్ లో నటించలేదు. ఈ ట్రైలర్ చూస్తున్నంతసే నాని దసరా, ప్యారడైజ్ సినిమాలు గుర్తుకువచ్చాయి. ట్రైలర్ లో ఆ స్థాయిలో యాక్షన్ చూపించారు. ఒకప్పుడు గ్రామాల్లో ఉండే దొరల పాలన నేపథ్యంలో సినిమా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ట్రైలర్ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఎమోషనల్, మాస్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐదుగురు చెల్లెల్లకు అన్నగా కనిపించడంతో ఈ సినిమా అన్నాచెల్లెల్ల సెంటిమెంట్ తో తెరకెక్కినట్టు అర్థమవుతోంది. ఇక ట్రైలర్ బ్యాక్ టూ బ్యాక్ వచ్చిన డైలాగులు కూడా పేలిపోయాయి. మరోవైపు భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్, పాటలు బాగున్నాయి. శర్వానంద్, అనుపమ, డింపుల్ నటన బాగుంది. శర్వానంద్ తెలంగాణ యాసలో అదరగొట్టినట్టు కనిపిస్తోంది. టెక్నీకల్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ట్రైలర్ చూస్తుంటే శర్వానంద్ ఖాతాలో హిట్ పడటం పక్కా అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందా తెలియాలి అంటే మాత్రం నవంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.


