సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం సాధారణమే. కొన్నిసార్లు ఒకే సినిమాలో నటిస్తున్న ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఇలా ఇండస్ట్రీలో చాలా జంటలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాయి కూడా. ప్రస్తుతం ఆ జంటలు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నాయి. మరోవైపు షూటింగ్ సమయంలో, ఆ తర్వాత కాస్త క్లోజ్ గా ఉన్నా ఇద్దరి మధ్య పుకార్లు కూడా పుట్టుకు వస్తుంటాయి. ప్రేమలో ఉన్నారని.. డేటింగ్ లో ఉన్నారని త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం కూడా మొదలవుతుంది. ప్రస్తుతం ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో ఓ జంట పేరు ట్రెండింగ్లో ఉంది. ఆ జంట మరెవరో కాదు శ్రీలీల కార్తీక్ ఆర్యన్. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు అని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రేమ వార్తలు రావడానికి కారణం అదే
అయితే వీరిద్దరి ప్రేమ పెళ్లి వార్తలు రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నవంబర్ 22న కార్తీక్ పుట్టినరోజు జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాలో అతడికి శుభాకాంక్షలు చెబుతూ ‘డోస్ ఆఫ్ డోపమైన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ,తాము దిగిన ఫోటోను షేర్ చేసింది. డోస్ ఆఫ్ డోపమైన్ అంటే సంతోషంగా ఉంచే వ్యక్తి అని అర్థం వస్తుంది. దీంతో శ్రీలీలకు కార్తీక్ ఆర్యన్ డోపమైన్ లా పనిచేస్తున్నాడు… అంటే వారిద్దరూ చాలా క్లోజ్ అయ్యారేమో అనే ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా వీరిద్దరూ ప్రేమ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఒకే సినిమాలో నటిస్తున్న జంట
ప్రస్తుతం వీరిద్దరూ కలిసి అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ మ్యూజికల్ లవ్ స్టోరీ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సింది. కానీ ఈ చిత్రాన్ని 2027కు పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం నుండి ఇద్దరూ ఎక్కువ క్లోజ్ గా ఉండడం వల్లే డేటింగ్ వార్తలు పుట్టుకు వచ్చాయి. మరోవైపు గత ఏడాది కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన వేడుకకు శ్రీలీల తన కుటుంబంతో కలిసి వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వేడుకకు వెళ్లడమే కాకుండా కార్తీక్ ఆర్యన్ శ్రీ లీల మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్సులో కనిపించడం అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పటినుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. సినిమా షూటింగ్ సమయంలోనే కాకుండా షూటింగ్ తర్వాత కూడా వీళ్ళు కలిసి తిరుగుతున్నారు. అంటూ ప్రచారం జరిగింది.
గతంలో కార్తీక్ ఆర్యన్ తల్లి కామెంట్స్ వైరల్
ఇది ఇలా ఉండగానే కార్తీక్ ఆర్యన్ తల్లి ఓ టీవీ షోలో మాట్లాడుతూ తన కుమారుడికి కాబోయే భార్య డాక్టర్ అయ్యి ఉంటే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. శ్రీలీల ఎంబిబిఎస్ చదవడంతో ఆమెను ఉద్దేశించే కార్తిక్ తల్లి ఈ కామెంట్ చేశారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆ సమయంలోను వీరిద్దరి ప్రేమ, పెళ్లి వార్తలు వినిపించాయి
ఇప్పుడు మళ్ళీ ఇద్దరి డేటింగ్ వార్తలు
ఇక ఇప్పుడు శ్రీలీల కార్తీక్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేసి అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ డోపమైన్ అని రాయడంతో శ్రీలీల తన ప్రియుడిని సాఫ్ట్ లాంచ్ చేస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా నార్త్ కింగ్ వెడ్స్ సౌత్ క్వీన్ అంటూ రాసుకొస్తున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ ఆర్యన్ రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించగా తాను ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేనని డేటింగ్ లో లేనని చెప్పాడు. ఆ వార్తలతో ఇద్దరి ప్రేమ వార్తల ప్రచారం ఆగిపోయింది. కానీ ఇప్పుడు శ్రీలీల చేసిన కామెంట్లతో మరోసారి వీళ్ళు ప్రేమలో ఉన్నారు అంటూ ప్రచారం మొదలైంది. మరి దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తారో చూడాలి.


