ఇటీవల వచ్చిన పాన్ ఇండియా సినిమాల్లో రామాయణ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. సినిమాలో రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటించగా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల వచ్చిన పాన్ ఇండియా సినిమాల్లో రామాయణ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. సినిమాలో రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటించగా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల ప్రేక్షకులను మెప్పించింది.ఇటీవల కాలంలో రామాయణం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో ఈ సినిమానే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రాముడి పాత్ర కంటే రావణుడి పాత్రను హైలెట్ గా చూపించారని, రావణుడి పాత్రలో యష్ అదరగొట్టాడని ప్రశంసలు వచ్చాయి. మరోవైపు ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉంది అంటూ ప్రేక్షకులు సర్టిఫికెట్ ఇచ్చారు.
ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో నటించిన బాలీవుడ్ యాక్టర్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే అంతా బాగున్నప్పటికీ సినిమాలో సీత పాత్రలో నటించిన సాయి పల్లవి పై మాత్రం కొందరు ట్రోలింగ్ చేయడం చిత్ర యూనిట్ ను ఇబ్బంది పెట్టింది. ఈ చిత్రంలో సాయి పల్లవి కంటే రావణుడికి భార్యగా నటించిన కాజల్ అగర్వాల్ అందంగా కనిపించిందని ఆమెను పక్కనపెట్టి సాయి పల్లవిని హీరోయిన్ గా ఎలా పెట్టారని కొంతమంది ట్రోల్స్ చేశారు. మరోవైపు కాజల్ కాకుండా ఇతర నటీమణులు కూడా అందంగా ఉన్నారని సాయి పల్లవిని కావాలని టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపించారు. సాయి పల్లవి మీద చేసిన విమర్శలకు దర్శకుడు చెంపచెళ్ళు మనిపించేలా సమాధానం ఇస్తూ ట్రోలర్స్ నోరు మూయించాడు.
రెండు వారాల్లో 1500 కోట్ల క్లబ్ లో రామాయణ
ఇక ఈ సినిమా విడుదలై రెండు వారాలు అవుతుండగా 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం ఈ రికార్డు మాత్రమే కాకుండా రెండు వారాల్లో రామాయణ ఖాతాల్లో అనేక రికార్డులు చేరాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం….
14 రోజుల్లో ఎన్నో రికార్డులు
బుక్ మై షో లో గంటలోనే 1.40 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అదేవిధంగా ఒకేరోజులో 16.60 లక్షల టికెట్లు అమ్ముడైన హిందీ సినిమాగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ చిత్రానికి ఫస్ట్ డే సుమారు 56.25 కోట్ల వసూలు వచ్చాయి. దీంతో ఇండియాలోనే ఐమాక్స్ ఓపెనింగ్స్ లో టాప్ లో రామాయణ నిలిచింది. కేవలం ఐదు రోజుల్లోనే ఇండియా నెట్ వసూళ్లలో రూ.300 కోట్ల మార్క్ అందుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన మూడో వేగవంతమైన భారతీయ సినిమా కూడా రామాయణ కావడం విశేషం. ఇక ఈ చిత్రానికి ఐదవ రోజు 95 కోట్లు, ఆరవ రోజు 78.21 కోట్లు, ఏడవ రోజు 61.10 కోట్ల నెట్ వసూళ్ళు వచ్చాయి.
హిందీ సినిమాలలో సోమ, మంగళ, బుధ వారాల్లో అత్యధిక వసూళ్లు రా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన మూడో వేగవంతమైన సినిమా కూడా రామాయణ కావడం విశేషం. గతంలో డైరెక్టర్ నితేష్ తివారీ తీసిన దంగల్ ఫస్ట్ డే 29.78 కోట్ల నెట్ వసూళ్ళు రాబట్టగా రామాయణ ఏకంగా 64.85 కోట్లతో నితేష్ తివారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా నిలిచింది. ఇలా అనేక రికార్డులు క్రియేట్ చేసి రాబోయే పాన్ ఇండియా సినిమాలకు రామాయణ బిగ్ టార్గెట్ ఇచ్చింది. ఇక ముందు ముందు రామాయణ ఎలాంటి రికార్డులు సాధిస్తుందో చూడాలి.



