రాజకీయాల్లోకి రావాలని పదవులు అనుభవించాలని చాలా మందికి ఆశ ఉంటుంది. నిజానికి రాజకీయాలు అంటే ప్రజాసేవ కానీ పదవులు అభివించడం.. ఆ హోదాను ఎంజాయ్ చేయడం కాదు అని గుర్తించరు. ప్రజాసేవ కోసమే రాజకీల్లోకి వచ్చి సేవ చేస్తున్నవాళ్లు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రజలకు కష్టం వచ్చింది అంటే చాలు ఎంత దూరం అయినా వెళుతుంటారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును చూస్తే కూడా అలానే కనిపిస్తున్నారు. దానికి కారణం ఆయన తుఫాన్ ప్రభావం నుండి ప్రజలను రక్షించడానికి తీసుకుంటున్న చర్యలే.

ఏపీని వణికిస్తున్న అర్ణబ్ తుఫాన్

ప్రస్తుతం ఏపీలో అర్ణబ్ తుఫాన్ ప్రజలను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఈ తుఫాన్ తీరం దాటి తీవ్రరూపం దాల్చింది. తుఫాన్ ప్రభావానికి రాష్ట్రంలో గంటకు 120 నుండి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలి అంటేనే భయపడిపోతున్నారు. కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ తుఫాన్ ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో భారీ గాలులు వీస్తున్నాయి. గాలుల దాటికి చెట్లు వేర్ల నుండి బయటపడి విరికిపోతున్నాయి. విద్యుత్ స్తంభాలు సైతం విరిగి కింద పడుతున్నాయి. దానివల్ల మంగళవారం రాత్రి కోనసీమ మొత్తం అంధకారంలోనే గడపాల్సి వచ్చింది. బుధవారం విద్యుత్ పునరుద్ధరించాలని అధికారులు భావించినా కురిసిన భారీ వర్షాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో తుఫాన్ కారణంగా ఏడుగురు మరణించారు. అయితే ఇంతటి భారీ తుఫాన్ వచ్చినా అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల పెను విషాద ఘటనలు మాత్రం చోటు చేసుకోలేదు.

74ఏళ్ల వయసులో రెస్ట్ లేకుండా చంద్రబాబు

అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రానికి తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే సీఎం రంగంలోకి దిగారు. మంత్రులు, అధికారులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ను ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిపారు. ఏ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది? అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అధికారులు ఏనాటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలపై చర్చించారు.

తుఫాన్ పై వరుస సమావేశాలు

అంతే కాకుండా మంగళవారం రాత్రి రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం మొదలయ్యాక మళ్ళీ అధికారులతో సమావేశం అయ్యారు. తుఫాన్ ఎఫెక్ట్ పై సుదీర్ఘంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకుని అధికారులకు సూచనలు చేశారు. మళ్ళీ బుధవారం ఉదయమే కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుతం పరిస్థితులపై ఆరా తీశారు.

కలెక్టర్లను ఇతర అధికారులను అప్రమత్తం చేశారు. మరో వైపు అన్ని జిల్లాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని గ్రౌండ్ లో దిగి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. చంద్రబాబు చెప్పినట్టే చాలా చోట్ల ఎమ్మెల్యే లు, ఎంపీలు గ్రౌండ్ లో కనిపించారు. హోం మంత్రి అనిత వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపు గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలకు పలు సూచనలు చేశారు. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సైతం పరిశీలించారు.

గురు, శుక్రవారాల్లో నేరుగా గ్రౌండ్ లోకి

మరోవైపు చంద్రబాబు గురువారం, శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించనున్నట్టు ప్రకటించారు. అధికారిక యంత్రాంగంతో కలిసి రాష్ట్రంలో గ్రౌండ్ లోకి వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించనున్నారు. బాధితులకు భరోసా ఇవ్వనున్నారు. మరోవైపు గురువారం ఏపీ కేబినెట్ సైతం భేటీ కానుంది. ఈ భేటీలో రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం పై చర్చిస్తున్నారు. తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టం, ప్రాణనష్టం ఇతర సమస్యలపై మంత్రులతో చర్చి పలు నిర్ణయాలు తీసుకుంటారు. నిజానికి రాష్ట్రంలో వచ్చిన తుఫాన్ చాలా ప్రమాదకర తుఫాన్ అని మొదటి నుండి చెబుతున్నారు. అలాంటి తుఫాన్ ను ఎదుర్కునేందుకు చంద్రబాబు 74 ఏళ్ల వయసులోనూ రెస్ట్ లేకుండా కష్టపడుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహించడం, ఈ వయసులో నేరుగా గ్రౌండ్ లోకి దిగడం లాంటి రిస్క్ చేస్తున్నారు. దీంతో చంద్రబాబు చేస్తున్న పనికి ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయన గ్రేట్ అంటూ పొగుడుతున్నారు.