సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎపుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడరు కానీ ఒక్కప్పుడు సినిమాల్లో నటించిన హీరోయిన్స్, సినిమా ఆఫర్స్ ఏదో ఒక సందర్భంలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతుంటారు. తాజాగా ఒకప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేసిన హీరోయిన్ నితి టేలర్ సంచలన ఆరోపణలు చేసింది. ఓ సౌత్ డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.

నితి టేలర్ నటించిన సినిమాలు

నితి టేలర్ తెలుగులో మొదటగా 2012లో మేం వయసుకు వచ్చాం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో “వెళ్ళిపోయే వెళ్ళిపోయే” పాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో యువతను సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తరవాత 2013లో రాహుల్ రవీంద్రన్ హీరోగా వచ్చిన పెళ్లి పుస్తకం సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాల తరవాత చివరగా తెలుగులో 2014లో లవ్ డాట్ కామ్ అనే సినిమాలో నటించింది. ఆ తరవాత టాలీవుడ్ కు పూర్తిగా దూరం అయింది. కానీ సౌత్ లోనే తమిళ ఇండస్ట్రీలో నీయుమ్ నానుమ్ నిలావుమ్ వానమ్ అనే సినిమాలో నటించింది. ఆ తరవాత నుండి హిందీలో వెబ్ సిరీస్ లు, సీరియల్స్ లోనే నటిస్తోంది.

ప్రస్తుతం సీరియల్స్, వెబ్ సిరీస్ లతో బిజీ

ఇదిలా ఉంటే సినిమాలకు దూరం అయిన తరవాత మ్యూజిక్ వీడియోలు, ఓటీటీ, హిందీ సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇతర ఆఫర్స్ రావడంతో స్క్రీన్ పై కనిపిస్తూనే ఉంది.

ఆ ముసలి డైరెక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు

ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ మాట్లాడుతూ… నేను సౌత్ లో కేవలం రెండు సినిమాలే చేశాను. అందులో మొదటి సినిమాకు దర్శకత్వం వహించిన వ్యక్తే తన రెండో సినిమాకి కూడా సంప్రదించాడు అని చెప్పింది. మొదటి సినిమా పూర్తైన తరవాత మరో సినిమా కోసం ఫోన్ చేశాడని అయితే ఈ సారి ఛాన్స్ ఇవ్వాలి అంటే తనతో గడపాలి అని కండిషన్ పెట్టాడని చెప్పింది. ఫోన్ లో డైరెక్టర్ కండిషన్ విన్న తరవాత తాను షాక్ అయ్యానని తెలిపింది. డైరెక్టర్ తో ఏం చెప్పాలో తెలియక వెంటనే ఫోన్ కట్ చేశానని చెప్పింది. ఆ తరవాత అతడి ఫోన్ నంబర్ కూడా బ్లాక్ చేశానని తెలిపింది. విషయం తన తల్లికి చెప్పానని.. అప్పటి నుండి సౌత్ సినిమాల్లో నటించడం ఆపేశానని తెలిపింది. ఆ ముసలి డైరెక్టర్ తరవాత మరికొందరు అమ్మాయిలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించడం చూశానని చెప్పింది.

సినిమాలకు దూరం అయ్యాకే ఆరోపణలు ఎందుకు

కేవలం నితి టేలర్ మాత్రమే కాకుండా చాలా మంది హీరోయిన్స్ ఆఫర్స్ తగ్గిన తర్వాత, సినిమాలకు దూరం అయ్యాక కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. దీంతో సినిమాల్లో నటించినప్పుడు సైలెంట్ గా ఉంటూ సినిమాలకు దూరం అయ్యాక ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

సౌత్ ఇండస్ట్రీనే టార్గెట్

అంతే కాకుండా చాలా మంది హీరోయిన్స్ సౌత్ లో సినిమాలు చేసి బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చాక ఇక్కడ అవకాశాలు ఇచ్చిన వాళ్ళపైనే ఆరోపణలు చేస్తున్నారు. సౌత్ లో అలాంటి దుస్తులు వేసుకొమన్నారు.. ఇలాంటి దుస్తులు వేసుకున్నారు. ఆ డైరెక్టర్ వేధించాడు. ఈ హీరో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని చెబుతుంటారు. పోనీ వేధించినవాళ్ల పేర్లు బయటపెడతారా అంటే అది కూడా చేయరు. మొత్తం ఇండస్ట్రీ పైనే ఆరోపణలు చేస్తుంటారు. అయితే ఇలా మీడియా ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు… వల్ల పేర్లు కూడా బయట పెట్టాలని లేదంటే సైలెంట్ గా ఉండాలి కానీ సౌత్ ఇండస్ట్రీ… తెలుగు ఇండస్ట్రీ అంటూ ఆరోపణలు చేయవద్దని మూవీ లవర్స్ కోరుతున్నారు.