సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అప్పట్లోనే ఈ చిత్రానికి సీక్వెల్ గా జైలర్ 2 ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే భారీ తారాగణంతో జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 తీశారు. నేడు ఈ సినిమా తమిళ్ తో పాటు ఇతర భాషల్లో విడుదల అయింది. అయితే ఇప్పటికే జైలర్ సినిమాకు సీక్వెల్ కావడంతో జైలర్ 2 పై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా అంచనాలను రీచ్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం….

కథ, కథనం

ఈ సినిమా కథ విషయానికి వస్తే కొడుకు చనిపోయిన తర్వాత టైగర్ ముత్తవేల్ పాండియన్( రజనీకాంత్) కోయంబత్తూర్ లోని ఓ సూపర్ మార్కెట్లో మేనేజర్ గా పని చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన కొడుకు మరణించడానికి కారణమైన వర్మ వినాయకన్ కు అసలు బాస్ ఎవరు అనే విషయాన్ని తెలుసుకుని అతడిని చంపే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అతనికి దిలీప్ సురాజ్ వెంజరమూడు సైతం అదే గ్యాంగ్ కు చెందిన చెందినవాడు అని తెలుస్తుంది .అతడి ద్వారా పాండ్యా.. వర్మ బాస్ ఎవరు? అని తెలుసుకొనే ప్రయత్నం చేస్తాడు. చివరికి పాండ్యాన్ కు వర్మపైన ఉన్న బాస్ ఎవరో తెలిసిందా? పాండ్యాన్ స్నేహితులుగా నటించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్, హృతిక్ రోషన్ ఎలా సహాయపడ్డారు. ఈ సినిమాలో నటించిన మరికొందరు ముఖ్యమైన పాత్రలు ఏంటి అనేదే ఈ సినిమా.

 

సాంకేతిక విశ్లేషణ దర్శకత్వం& స్క్రీన్ ప్లే

ఈ సినిమా మొదటి పార్ట్ కు కంటిన్యూ చేస్తూ ప్రారంభమవుతుంది. సినిమా ప్రారంభమైన తర్వాత ప్రేక్షకులు కథలోకి లీనమైపోతారు. మెలిమెల్లిగా సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. అక్కడక్కడా కాస్త సాగదీత అనిపించినా తర్వాత మాత్రం మంచి ఫీల్ కలుగుతుంది. జైలర్ సినిమా మాదిరిగానే ఈ సినిమాలో వచ్చే సన్నివేశాలకు సైతం అనిరుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోస్తుంది. ఈ సినిమాలో యోగి బాబు కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. ఫస్ట్ పార్ట్ విలన్ ను కనిపెట్టడం.. అతని గ్యాంగ్ పక్కనే ఉంటూ వారి ఆట కట్టించడం ఆసక్తికరంగా ఉంటాయి. సినిమాలోని ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. అంతేకాకుండా ఆ ఫ్రీ ఇంటర్వెల్ చూసిన తర్వాత సెకండాఫ్ పై అంచనాలు పెరిగిపోతాయి. అయితే సెకండాఫ్ లో మాత్రం సినిమా రొటీన్ గా అనిపిస్తుంది. దాదాపు ఫస్ట్ పార్ట్ చూసిన ఫీలింగ్ ఏ వస్తుంది. అయితే సినిమాలో నటించిన భారీ తారాగణం ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇవ్వడం…. వారి సన్నివేశాలు ఆసక్తి కలిగించే విధంగా ఉంటాయి. దీంతో స్క్రీన్ ప్లే అంతా ఇక్కడా బోర్ కొట్టకుండా కథ సాఫీగా వినోదాత్మకంగా సాగిపోతుంది.

నటీనటుల పనితీరు

నటీనటుల పనితీరు విషయానికి వస్తే రజనీకాంత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. కొన్ని సన్నివేశాల్లో రజిని స్టైల్ ఓల్డ్ రజనీని గుర్తు చేస్తుంది. అదేవిధంగా యోగి బాబు కామెడీ టైమింగ్ ప్లస్ అయింది. మూతి పాత్రలో అతడు చక్కగా నవ్విస్తాడు. అదేవిధంగా ఎస్ జె సూర్య పాత్ర రొటీన్ గా ఎప్పటిలాగే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో నటించిన విజయ్ సేతుపతి మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్ తక్కువ సన్నివేశాల్లోనే కనిపించినప్పటికీ వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన సీన్లు అదిరిపోయాయి. మరోవైపు బాలీవుడ్ నటి విద్యాబాలన్ సైతం తన పాత్రకు న్యాయం చేసింది. రమ్యకృష్ణ రోల్ సైతం ఈ చిత్రంలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి ఫుల్ లెన్త్ లో కనిపించారు. ఆయన పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంది.

మ్యూజిక్

జైలర్ మ్యూజిక్ తో అనిరుధ్ అదరగొట్టాడు. ఈ సినిమా తర్వాత అనిరుధ్ మ్యూజిక్ గురించే చాలామంది మాట్లాడుకున్నారు. జైలర్ 2 లోను అనిరుధ్ అదే విధంగా రెచ్చిపోయాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు ఎక్కడా తగ్గకుండా కొట్టాడు. కొన్ని పాటలు కూడా బాగున్నాయి. అయితే ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ లో వాడిన కొన్ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లు కూడా కలిపేశాడు.

సినిమాటోగ్రఫీ & నిర్మాణం

ఈ సినిమా నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రానికి విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక జైలర్ సినిమా మాదిరిగానే ఇందులోనూ లొకేషన్స్ ను చక్కగా చూపించారు. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.

ప్లస్ పాయింట్స్ & మైనస్ పాయింట్స్

ఈ సినిమా ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్ల విషయానికి వస్తే.. ఈ చిత్రానికి నటీనటుల పర్ఫామెన్స్ ప్లస్ గా నిలిచింది. అదేవిధంగా అనిరుధ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది. స్క్రీన్ ప్లే సైతం బాగుంది.

మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే… సెకండాఫ్ అంచనాలను అందుకోలేకపోయింది చాలా చోట్ల ఫస్ట్ పార్ట్ చూసిన ఫీలింగ్ వస్తుంది. కథలో కొత్తదనం లేకపోవడం కాస్త నిరాశ పరుస్తుంది.

ముగింపు: అంచనాలకు దగ్గరగా వచ్చిన జైలర్ 2