మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ఖాఖా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
చిరంజీవి మరికొన్ని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
చిరంజీవి బాబి దర్శకత్వంలో చేస్తున్న ఖాఖా సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న విశ్వంభర సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేసినప్పటికీ షూటింగ్ ఆలస్యం అవ్వడంతో వాయిదా పడింది. అంతేకాకుండా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఇటీవల విడుదలైన ది పారడైజ్ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో ఈ సినిమా నిలిచిపోయింది అంటూ కూడా టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై డైరెక్టర్ కానీ చిరంజీవి కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇది ఇలా ఉండగానే చిరంజీవి ఆటో జానీ అనే మరో సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. కానీ ఈ సినిమాపై కూడా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు.
మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి చిరంజీవి
ఇక తాజాగా ఓ ఆసక్తికర వార్త మెగాస్టార్ చిరంజీవి గురించి బయటకు వచ్చింది. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ ఇప్పుడు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ హైదరాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ తో ఓ మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన మల్టీప్లెక్స్ బిజినెస్ వైజాగ్ కు సైతం విస్తరించాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. వైజాగ్ లో చిరంజీవి మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారని ఆయన ప్రకటించారు. గరివిడి లక్ష్మీ సినిమా ఈవెంట్లో మంత్రి ఈ ప్రకటన చేశారు. దీంతో వైజాగ్ లో చిరు ఏ రేంజ్ లో మల్టీప్లెక్స్ కట్టబోతున్నారు అంటూ చర్చ మొదలైంది. అంతేకాకుండా ఇప్పటికే వైజాగ్ లో కొన్ని మల్టీప్లెక్స్ లు ఉండగా చిరంజీవి వాటిని మించిపోయేలా కడతారని ప్రచారం కూడా జరుగుతుంది. మరి వైజాగ్ ప్రజల కోసం మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మల్టీప్లెక్స్ నిర్మాణం చేపడతారో చూడాలి.
ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్స్ ఇదే బిజినెస్ లో
సాధారణంగా నిర్మాతలు ఎక్కువగా వ్యాపారాలు చేస్తుంటారు. థియేటర్లు, మల్టీప్లెక్స్ ల వ్యాపారాలలో దాదాపు వాళ్లే ఉంటారు. కానీ ఇప్పటికే కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. అంతేకాకుండా సక్సెస్ఫుల్గా ఆ వ్యాపారాలను రన్ చేస్తున్నారు. మహేష్ బాబు నుండి విజయ్ దేవరకొండ వరకు పలువురు హీరోలు ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. మహేష్ బాబు ఏఎంబి థియేటర్ హైదరాబాద్ లోనే ఫేమస్ కూడా అయ్యింది. గచ్చిబౌలిలోని ఈ థియేటర్ ఎప్పుడూ ప్రేక్షకులతో కిటకిటలాడుతుంది. కొత్త సినిమా వచ్చిందంటే చాలు ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతూ ఉంటారు. ఎన్నో హంగులతో అత్యాధునిక వసతులతో ఈ థియేటర్ నిర్మించారు. మరోవైపు వనస్థలిపురంలో హీరో రవితేజ భారీ మల్టీప్లెక్స్ ను నిర్మించారు. అదేవిధంగా అల్లుఅర్జున్ సైతం సిటీలో మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. మరోవైపు హీరో విజయ్ దేవరకొండ తన సొంత ఊరు అయిన మహబూబ్నగర్ లో ఓ భారీ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం వీరంతా ఈ బిజినెస్ లో రాణిస్తుండగా ఇప్పుడు సీనియర్ హీరో అయిన చిరంజీవి సైతం మల్టీప్లెక్స్ వ్యాపారం లోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. సినిమాల్లో సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి మల్టీప్లెక్స్ వ్యాపారంలో ఎలా రాణిస్తారో చూడాలి మరి.



