టాలీవుడ్ లవర్ బాయ్స్ లో నితిన్ కూడా ఒకరు. 2002లో జయం సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నితిన్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. తర్వాత వరుస పెట్టి సినిమాలు తీశారు. ఇప్పటివరకు నితిన్ 34 సినిమాలలో హీరోగా నటించారు. అయితే ఆయన కెరీర్లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్నాయి. నితిన్ నటించిన సినిమాలు ఏవి అందులో ఏది హిట్? ఏది ఫ్లాప్? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్

జయం సినిమా తర్వాత ఇండస్ట్రీలో నితిన్ కు ఎంతో క్రేజ్ వచ్చింది. దీంతో ఆయన దిల్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తర్వాత నితిన్ సంబరం అనే సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా మాత్రం నితిన్ ను నిరాశపరిచింది. నితిన్ కెరియర్లో ఇదే మొదటి ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఈ చిత్రం తర్వాత శ్రీ ఆంజనేయం అనే భక్తిరస చిత్రంలో నటించగా ఈ సినిమా కూడా లాప్ అయ్యింది. అయితే ఇలాంటి ఫ్లాపుల మధ్యలో రాజమౌళి రూపంలో నితిన్ కు మరో హిట్ సినిమా వచ్చింది. అదే సై స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన సై సినిమా అప్పట్లో సూపర్ హిట్ అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే అభిమానులు ఉన్నారు. ఈ చిత్రం తర్వాత నితిన్ మరో ఫ్లాప్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచాడు. అదే అల్లరి బుల్లోడు..

సై తరవాత వరుస ఫ్లాపులు

సై తర్వాత నితిన్ కు వరుస ప్లాపులు వచ్చాయి. సై తరవాత వచ్చిన అల్లరి బుల్లోడు, ధైర్యం, రామ్, టక్కరి, ఆటాడిస్తా, విక్టరీ, హీరో, ద్రోణ, అగ్యాత్, రెచ్చిపో, సీతారాముల కళ్యాణం లంకలో, మారో ఇలా వరుసగా 12 ఫ్లాప్ సినిమాలను నితిన్ చూడాల్సి వచ్చింది.

నితిన్ ను నిలబెట్టిన ఇష్క్

ఇలా వరుస ప్లాపులలో నితిన్ ను మరో హిట్ పలకరించింది. అదే ఇష్క్ సినిమా.. విక్రమ్ కే కుమర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమాతో నితిన్ కు యూత్ ఫిదా అయ్యారు. ఇలాంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ నితిన్ ప్రయోగాత్మక సినిమాలను వదిలి లవ్ ట్రాక్ ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన గుండెజారి గల్లంతయింది సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హార్ట్ ఎటాక్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ను నమోదు చేసుకుంది. ఒకప్పుడు వరుస ఫ్లాప్ లతో సతమతమైన నితిన్ కు ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ పడింది. ఈ చిత్రాల తర్వాత నితిన్ చిన్నదాన నీకోసం అనే మరో ప్రేమ కథా చిత్రంలో నటించారు.

గుండె జారి గల్లంతయ్యిందే తరవాత మళ్లీ ఫ్లాప్స్

ఇక ఈ సినిమా తర్వాత కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే మరో ఫ్లాప్ సినిమాలో నితిన్ నటించాడు. ఈ చిత్రం తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం తర్వాత మళ్లీ డిజాస్టర్ సినిమాలో నితిన్ నటించాడు. ఈ చిత్రం తర్వాత వచ్చిన లై సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కాకుండా తరవాత వచ్చిన చల్ మోహన్ రంగా సైతం డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరవాత శ్రీనివాస కళ్యాణం సైతం అట్టర్ ఫ్లాప్ అవ్వగా మళ్ళీ భీష్మ అనే మరో ప్రేమ కథ చిత్రంతో నితిన్ ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత వచ్చిన చెక్, మాస్ట్రో సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశ పరిచాయి. అంతేకాదు ఈ సినిమా తర్వాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ ఫుడ్, తమ్ముడు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.

ఆశలన్నీ అలియాస్ రుక్మిణి పైనే

ఇక నితిన్ తదుపరి సినిమా అలియాస్ రుక్మిణి. నితిన్ అభిమానులు ఇప్పుడు ఈ సినిమా పైనే అంచనాలు పెట్టుకున్నారు మరి ఈ సినిమా అయినా విజయం సాధిస్తుందా లేదా చూడాలి.