టాలీవుడ్ నటి యాంకర్ విష్ణు ప్రియ భీమినేని అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ వెండితెరపై సినిమాల్లోనూ నటిస్తోంది. ముఖ్యంగా గ్లామరస్ రోల్స్, డ్యాన్స్ వీడియోలు చేస్తూ బోల్డ్ పర్సనాలిటీతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. బేసిక్ గా తెలుగు అమ్మాయి అయినప్పటికీ విష్ణుప్రియ మలయాళంలో “మయూఖం” అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తమిళ్ లోనూ శివప శివపత్తిగరమ్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమా ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టినప్పటికీ నటిగా విష్ణు ప్రియకు సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. కానీ ఈటీవీలో చేసిన టీవీ షో ద్వారా ఆమె ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది.

సినిమాల కంటే యాంకర్ గానే సక్సెస్

బుల్లితెరపై గలగలా మాట్లాడుతూ యువతను ఆకట్టుకునేలా పంచులు వేయడంతో బ్యూటీకి ఫ్యాన్స్ పెరిగిపోయారు. సుడిగాలి సుదీర్ విష్ణు ప్రియ జోడీకి ఇప్పటికీ చాలా మంది అభిమానులు ఉన్నారు. వీళ్లు చేసిన పోయే పోరా షో తోనే విష్ణుప్రియకు బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీ బిగ్ బాస్ 8 సీజన్ లోనూ కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకుల మనసు దోచుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అప్పట్లో విష్ణు ప్రియ నటించిన “దయ” అనే వెబ్ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఇటీవల అల్లరి నరేష్ హీరోగా నటించిన “రాంబ ఊర్వశి మేనక” సినిమాలోను ముఖ్యమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది.

సినిమాలు టీవీ షోల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ క్రేజ్

ఇదంతా ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో విష్ణుప్రియకు ఉన్న క్రేజ్ మరో ఎత్తు. తెలుగులో యాంకర్ అనసూయ తర్వాత అంతటి గ్లామరస్ యాంకర్ గా విష్ణు ప్రియనే అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో విష్ణుప్రియ పెట్టే పోస్టులకు లక్షల్లో లైకులు.. వేలలో కామెంట్లు వస్తూ ఉంటాయి. ఈ బ్యూటీ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోతలో ముందు వరుసలో ఉంటుంది. అంతేకాకుండా ఫిట్నెస్ పైనా అదే స్థాయిలో దృష్టి పెట్టి కుర్రాల మతిపోగొడుతూ ఉంటుంది. అయితే ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్లను క్యాష్ చేసుకోవడంలోనూ విష్ణు ప్రియ సూపర్ సక్సెస్ అవడంతో ఆమె వార్తల్లో నిలిచారు. అసలు తెలుగులో ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అంటేనే విష్ణు ప్రియ గుర్తుకు వచ్చేలా చేశారు. ఇన్ స్టాలో విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ కు నెలకు రూ.399 తీసుకుంటున్నారు. అంటే ఇది నెల రోజుల ఫోన్ రీఛార్జి చేసుకున్నంత ఖర్చు. అయినప్పటికీ ఈమెకు ఏకంగా 8449 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీరంతా నెలకు 399 చెల్లిస్తూ సుబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. అంటే దాదాపు విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ ద్వారా సంపాదించే మొత్తం 33 లక్షల 7వేలు… అంటే రోజుకు విష్ణు ప్రియ లక్ష పైనే సంపాదిస్తున్నారు.

గతంతో పోలిస్తే పెరిగిన సంపాదన

గతంలో ఈ నెల వారి సంపాదన 20 లక్షల వరకు ఉండగా అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం, ఆదాయం కూడా పెరగడంతో మరోసారి సోషల్ మీడియాలో విష్ణుప్రియ సంపాదనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

విష్ణు ప్రియ దారిలోనే మరికొందరు భామలు

విష్ణు ప్రియ ఆదాయం చూసి మరికొందరు భామలు సైతం అదే దారిలో వెళ్తున్నారు. ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న కొందరు హీరోయిన్లు, సీరియల్ నటీమణులు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్ లు సైతం సబ్స్క్రిప్షన్ ఆప్షన్ తీసుకువచ్చారు. అందులో తమ గ్రామరస్ ఫోటోలు షేర్ చేస్తూ చేతినిండా సంపాదిస్తున్నారు. ఇందులో చాలామంది సంపాదన లక్షపైనే ఉండటం విశేషం. అయితే తెలుగులో మాత్రం ఎవరు ఈ బ్యూటీని డామినేట్ చేయలేకపోతున్నారు.

గతంలో విష్ణు ప్రియపై ఫిర్యాదులు

విష్ణు ప్రియ అందాల ఆరాబోతుపై గతంలో ఫిర్యాదులు కూడా అందాయి. కొంతమంది సబ్స్క్రిప్షన్ వ్యవహారంపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. కానీ సరైన ఆధారాలు సమర్పించడం, లీగల్ గా ఆ కేసు ఫెయిల్ అవ్వడంతో విష్ణు ప్రియ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమె సుబ్స్క్రిప్షన్ ను కంటిన్యూ చేస్తున్నారు. ఏదేమైనా ప్రతినెలా సబ్స్క్రిప్షన్ ద్వారానే ఈ రేంజ్ లో సంపాదిస్తుంది విష్ణు ప్రియ గ్రేట్ అనే చెప్పాలి.