టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటించిన కామ్రేడ్ కళ్యాణ్ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా నాలుగు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. దీంతో శ్రీ విష్ణు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అసలు శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు ఎంత బడ్జెట్ కేటాయించారు. ఈ సినిమా నాలుగు రోజుల్లో కలెక్ట్ చేసిన వసూళ్ళు ఎన్ని అనేది ఇప్పుడు చూద్దాం…
కామ్రేడ్ కళ్యాణ్ సినిమా గురించి
కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటించగా మహిమ నంబియార్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సత్య, సుదర్శన్, షైన్ టామ్ చాకో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జానకిరామ్ మారెళ్ళ దర్శకత్వం వహించారు. వెంకటకృష్ణ కర్నాటి, శీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్& కోనాఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానియన్ స్వరాలు సమకూర్చారు. అక్టోబర్ 9న ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంధ్ర- ఒరిస్సా ఏజెన్సీ ప్రాంతంలో థియేటర్ నడిపించే హీరో ఆ తర్వాత నక్సలైట్ గా ఎలా మారుతాడు. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడతాడు, వారి నుండి ఎలా బయటపడతాడు అనేదే ఈ సినిమా.
వీకెండ్ లో కలెక్షన్ల జోరు
ఈ సినిమాకు వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ కాస్త తక్కువ వచ్చినా వీకెండ్ లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో నాలుగో రోజున ఈ సినిమా 1. 75 కోట్ల స్థాయిలో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగోరోజు 2.10 కోట్ల స్థాయిలో గ్రాస్ వసూలు చేయగా కోటిలోపు షేర్ ను రాబట్టింది. మొత్తం నాలుగు రోజుల్లో ఈ చిత్రం కలెక్షన్ల వివరాలు చూసినట్లయితే నైజాంలో 6.25 కోట్లు వసూలు చేసింది. ఏపీలో 5.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఏపీ తెలంగాణ కలిపి 11.75 కోట్ల గ్రాస్ వసూలు చేయగా… 5.80 కోట్ల షేర్ రాబట్టింది. కాగా ఈ సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయినట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. దీంతో నెక్స్ట్ ఈ సినిమాకు లాభాలే అని క్లారిటీ వచ్చేసింది.
హిట్ ట్రాక్ లో దూసుకుపోతున్న శ్రీ విష్ణు
వరుస విజయాలతో హీరో శ్రీ విష్ణు హిట్ ట్రాక్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు మంచి రెస్పాన్స్ రాగా ఆయన గత సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇదే ఏడాది శ్రీ విష్ణు హీరోగా నటించిన మృత్యుంజయ సినిమా ప్రేక్షకులను నిరాశనపరిచినప్పటికీ దానికంటే ముందు వచ్చిన విష్ణు విన్యాసం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 18 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా కమర్షియల్ విజయాన్ని అందుకుంది.
సింగిల్ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్
ఈ సినిమాకు ముందు వచ్చిన సింగిల్ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇలా శ్రీవిష్ణు ఎక్కువగా యూత్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలనే ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఎక్కువగా తన సినిమాలలో సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ …యువతకు కనెక్ట్ అయ్యే డైలాగులు కనిపిస్తున్నాయి. ఇలానే కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో హీరో నాని రేంజ్ కి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఫ్యూచర్లో కూడా శ్రీ విష్ణు ఇదే హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తారా.. లేదంటే మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడి ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటారా అని.



