సాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చింది అంటే థియేటర్లలో సినిమాల సందడి కనిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల ఫైట్ ఉంటుంది. ఎక్కువగా సంక్రాంతి సమయంలో మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలే కనిపిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా కూడా పెద్ద పండుగ అయినప్పటికీ సినిమాలు మాత్రం తక్కువనే చెప్పాలి. ఒకటి రెండు సినిమాలు అలా థియేటర్లలో సందడి చేసి వెళుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది దసరాకు మాత్రం ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటి? ఎప్పుడు విడుదల కాబోతున్నాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం…
రజినీకాంత్ జైలర్ 2
ముందుగా రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ 2 సినిమా అక్టోబర్ 15న విడుదల కాబోతుంది. ఇప్పటికే జైలర్ సినిమా విడుదల కాగా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 తీశారు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మోహన్ లాల్, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్, విద్యాబాలన్ సహా భారీ తారాగణం కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే అక్టోబర్ 15 వరకు వెయిట్ చేయాల్సిందే.
విజయ్ దేవరకొండ రణబలి
ఈ దసరాకు విడుదలకు సిద్ధంగా ఉన్న మరో పెద్ద సినిమా రణబలి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన సతీమణి రష్మిక మందన హీరోయిన్ గా నటించినది. భారీ పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు శ్యామ్ సింగరాయ్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాహుల్ సాంకృత్యన్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే అక్టోబర్ 16 వరకు వెయిట్ చేయాలి.
క్రేజీగా క్రేజీ కల్యాణం
ఈ దసరాకు విడుదల కాబోతున్న మరో క్రేజీ సినిమా క్రేజీ కల్యాణం. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా తరుణ్ భాస్కర్ ముఖ్యమైన పాత్రలో నటించాడు. అఖిల్ రాజ్, బ్రహ్మానందం సైతం ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న నేటి తరం యువతకు ఎదురయ్యే ఇబ్బందులు.. కెరీర్ పై ఫోకస్, తదితర అంశాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సినిమాగా తెరకెక్కింది. అక్టోబర్ 16న ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
గరివిడి లక్ష్మీ
బుర్రకథ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా గరివిడి లక్ష్మి అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆనంది విజయలక్ష్మి పాతలో నటించగా గౌరీ నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాలో రాగ్ మయూర్, రాశి, వికే నరేష్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ప్రసారం చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం పై సైతం భారీ అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా వచ్చే సినిమాల్లో ఈ సినిమా చివరగా అక్టోబర్ 17న విడుదల కాబోతుంది. మరి గరివిడి లక్ష్మి బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందా లేదా అని తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
నాలుగు డిఫరెంట్ జోనర్ చిత్రాలే
దసరాకు విడుదల కాబోతున్న సినిమాలలో నాలుగు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ నుంచి రాబోతున్నాయి. ఈ సినిమాలలో ఒక్కో సినిమాకు ఒక్కో ప్రత్యేకత ఉంది. గరివిడి లక్ష్మి సినిమా బయోపిక్ అయితే, జైలర్ సినిమా యాక్షన్ సినిమా.. మరోవైపు విజయ్ దేవరకొండ రణబలి పిరియాడికల్ డ్రామా. అంతేకాకుండా క్రేజీ కళ్యాణం పూర్తి వినోద భరితమైన సినిమా. మరి ఈ నాలుగు జోనర్స్ సినిమాల్లో ఏ సినిమా దసరా విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.



