ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి హవా కనిపించింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ అధికారంలో లేదు.. టీడీపీ, జనసేన పార్టీలకు కోస్తాంధ్ర ప్రాంతంలో ఎక్కువ పట్టు ఉంది కాబట్టి జనసేన ఓటమి సాధారణమే. అయితే వైసీపీకి ఎంతో పట్టున్న ప్రాంతమైన రాయలసీమలోనూ ఘోర పరాజయం పాలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్న విడుదలైన మున్సిపల్ ఎన్నికలతో పాటు ఇప్పుడు విడుదలవుతున్న పరిషత్ ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాలే వస్తున్నాయి.

జగన్ కంచుకోటలో కూటమి జండాల రెపరెపలు

ఫలితాలు చూస్తే జగన్ కంచుకోటను కూటమి బద్దలు కొట్టినట్టు క్లారిటీగా కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత సీమలో ప్రాంతాలవారీగా 60 శాతం నుండి 72 శాతం వరకు ఓటింగ్ జరిగింది. దీంతో మొదటి నుండి సీమలో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని అందరూ అంచనాలు వేశారు. కానీ అంచనాలు చివరికి తలకిందులు అయ్యాయి. ఇక్కడే కూటమికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. వైసీపీకి కీలక జిల్లాలైన అయినా కడప కర్నూలు అనంతపూర్ లాంటి చోట్ల వైసిపి డీలా పడిపోయింది. పార్టీ విధానాలు, అధినేత వైఖరి, రాష్ట్రంలో ఓటమి తర్వాత కీలకమైన నేతలు దూరమవ్వడం, ద్వితీయ శ్రేణి నాయకులు పలువురు దూరమవడం కూడా పార్టీకి మైనస్ అయినట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కడప జిల్లాలో కూటమి క్లీన్ స్వీట్ చేసింది. జిల్లాలో మొత్తం ఐదు పురపాలక సంఘాలు ఉండగా వాటిలో నాలుగు మున్సిపాలిటీలో ఒకటి నగర పంచాయతీ ఉన్నాయి. ఈ ఐదు స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. వైఎస్ ఫ్యామిలీకి కడప జిల్లా దశాబ్దాలుగా కంచుకోటగా ఉంది. అలాంటి జిల్లాలో ఇప్పుడు వైసీపీ కాకుండా కూటమి జెండాలు ఎగరడం ఆశ్చర్యకరంగా మారింది.

పులివెందులలో టీడీపీ హవా

ఇదిలా ఉంటే జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా మున్సిపాలిటీని వైసీపీ దక్కించుకోలేకపోయింది. 43 ఏళ్ల చరిత్రలో తొలిసారి పులివెందులలో చారిత్రాత్మక విజయాన్ని టీడీపీ నమోదు చేసింది. టిడిపి అభ్యర్థి గీత కుమారి తన సమీప వైసిపి అభ్యర్థి వైఎస్ ప్రమీలపై 13,898 ఓట్ల మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో కడప జిల్లా పై కూటమి పూర్తి పట్టు సాధించింది. ఇక పరిషత్ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలే రిపీట్ అయ్యాయి

పరిషత్ ఎన్నికల్లోనూ రిపీట్

పులివెందుల జడ్పిటిసి స్థానంలో టిడిపి అభ్యర్థి బి.భారతి 14,63 ఓట్ల మెజారిటీతో వైసిపి అభ్యర్థి పై ఘన విజయం సాధించింది. మరోవైపు మైదుకూరు జడ్పిటిసి సైతం టిడిపి కైవసం చేసుకుంది. ఇక్కడ టిడిపి అభ్యర్థి కృష్ణ కిషోర్ వైసీపి అభ్యర్థి పై ఘన విజయం సాధించారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేముల జడ్పిటిసి స్థానాన్ని మాత్రం వైసీపీ సొంతం చేసుకుంది. ఇక్కడ వైసిపి అభ్యర్థి సత్య ప్రభావతి 19,203 ఓట్ల భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థి పై విజయం సాధించారు. ఇక ఎమ్మెల్సీ స్థానాల్లోనూ కూటమి పార్టీలే ఎక్కువ స్థానాలలో విజయం సాధించాయి.

రాయలసీమలో వైసీపీ ఓటమికి కారణాలు ఏంటి?

అయితే రాయలసీమలో వైసిపి ఓటమికి కారణాలపై విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దీంతో వైసిపి ఫలితాలు ఈ స్థాయిలో రావడానికి అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. సొంత నియోజకవర్గాలలో పట్టు కోల్పోవడం వలన పార్టీకి ఈ రకమైన ఫలితాలు వచ్చాయని అభిప్రాయాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే ఓటమిపాలవడం ఆ పార్టీ ఏ స్థాయిలో బలహీనంగా ఉందో స్పష్టం చేస్తోంది. మరోవైపు ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసికట్టుగా బరిలోకి దిగడంతో ఓట్లు చీలలేదు. అది కూటమి పార్టీలకు కలిసి వచ్చింది. ఓటు బ్యాంకు పెరగడంతో విజయానికి దగ్గర చేసింది. మరోవైపు అటు మున్సిపల్ ఇటు పరిషత్ ఎన్నికల్లో కూటమి ఏకగ్రీవాల్లో దూసుకుపోయింది. ఎన్నికల ముందు ఎక్కువ ఏకగ్రీవాలు చేయడంతో వైసిపి నేతల్లో నిరాశ మొదలైంది. దీంతో వాళ్ళు గ్రౌండ్లో యాక్టివ్ గా ఉండలేకపోయారు. అది కూడా సీమలో వైసీపీ ఓటమికి కారణమైందని తెలుస్తోంది.